తలపతి విజయ్- తండ్రి చంద్రశేఖర్ మద్య కొన్ని విబేధాలు ఉన్నట్లు చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. ఇటీవలే విజయ్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో సోషల్ మీడియాలో ఎంత యాగీ జరిగిందో తెలిసిందే. విజయ్ కి తెలియకుండా చద్రశేఖర్ ..ఆయన పేరుతో రాజకీయ పార్టీ ఆఫీస్ పెట్టడం…ఇది విజయ్ కి నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరినట్లు నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
తండ్రి మీదనే విజయ్ పొలీస్ కేసు పెట్టాడని వార్తలొచ్చాయి. ఇదంతా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం తప్ప! దీని గురించి తండ్రి-తనయుడు గానీ ఎప్పుడూ స్పందించలేదు. అయితే విజయ్ తండ్రి కి దూరంగా ఉంటున్నాడనే బలమైన ప్రచార ఎప్పటి నుంచో ఉన్న నేపథ్యంలో మీడియా కథనాలపై ఆసక్తి సంతరించుకుంది. తండ్రి-కొడుకు మధ్య నిజంగానే ఇవన్నీ జరుగుతున్నాయా? అనిపించేలా సీన్ తలపించింది. తాజాగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఒక్క ఫోటోతో అన్నింటికి విజయ్ పుల్ స్టాప్ పెట్టేసాడు.
విజయ్ తండ్రి కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన విజయ్ అమెరికా నుంచి రాగానే నేరుగా తండ్రిని చూసేందుకు వెళ్లారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుమారుడు చాలా రోజుల తర్వాత ఇంటికి రావడంతో కుమారుడికి ఇష్టమైన వంటకాలు అన్ని రెడీ చేయించి పెట్టారుట.
ఇదే సందర్భంగా తన తల్లిదండ్రులతో కలిసి ఫొటోలు దిగాడు విజయ్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తల్లిదండ్రులతో విజయ్ ని అలా చూసి అభిమానులు సంతోష పడుతున్నారు. ప్రస్తుతం విజయ్ `లియో` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. లొకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. అక్టోబర్ 19న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.