ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

తమిళ యాసలో అద‌ర‌గొట్టిన తార‌క్-జాన్వీ

త‌మిళ‌నాడు నుంచి వ‌చ్చి టాలీవుడ్ లో తెలుగు మాట్లాడిన హీరోలు త‌క్కువ‌మంది ఉన్నారు. అందులో అగ్ర హీరో సూర్య సోద‌రుడు కార్తీ స్ప‌ష్ఠంగా తెలుగు మాట్లాడ‌గ‌ల‌రు. కానీ సూర్య‌కు తెలుగు రాదు. తెలుగు హీరోల్లో చాలామందికి చెన్నై(నాటి మ‌ద్రాసు)తో ఉన్న అనుబంధం కార‌ణంగా త‌మిళం స్ప‌ష్ఠంగా మాట్లాడ‌గ‌ల‌రు. నాగ‌చైత‌న్య‌, రామ్ చ‌ర‌ణ్‌, బ‌న్ని, ఎన్టీఆర్, ప్ర‌భాస్ ఇలా చాలా మంది తెలుగు అగ్ర హీరోలు త‌మిళ యాస‌ను స్ప‌ష్ఠంగా ప‌ల‌క‌గ‌ల‌రు.

ఇదే వేదిక‌పై దేవ‌ర క‌థానాయిక జాన్వీ క‌పూర్ సైతం త‌మిళం అద్భుతంగా మాట్లాడింది. ధ‌డ‌క్ తో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన జాన్వీ ఇప్పుడు దేవ‌ర‌తో ద‌క్షిణాదికి ప‌రిచ‌య‌మ‌వుతోంది. అటు త‌మిళంలోను దేవ‌ర విడుద‌ల‌వుతోంది గనుక చెన్నై ప్ర‌మోష‌న్స్ లో జాన్వీ క‌పూర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. అయితే జాన్వీ మూలాలు త‌మిళ‌నాడులోనే ఉన్నాయి. మ‌ద్రాసుతో జాన్వీ క‌పూర్ త‌ల్లి గారైన శ్రీ‌దేవికి ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. చెన్నైలో వారికి సొంత ఇల్లు కూడా ఉంది. జాన్వీ త‌ర‌చుగా ఆ ఇంటిని విజిట్ చేస్తుంటుంది. బోనీ కపూర్-జాన్వీ ఇద్ద‌రూ ఆ ఇంటిని సంద‌ర్శించిన ప్ర‌తిసారీ ఆ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు చెన్నైలో దేవ‌ర ప్ర‌చారంలో జాన్వీ త‌మిళ యాసలో మాట్లాడుతూ ఆక‌ట్టుకుంటోంది.

జాన్వి ఇప్పటివరకు ఆవిష్కరించిన ప్రచార కంటెంట్‌లో అద్భుత‌మైన‌ స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినీ ప్రేక్షకులను విమర్శకులను ఆకట్టుకుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న పాట‌ల్లో అద్భుతమైన డ్యాన్స్ స్కిల్స్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. తాజాగా త‌మిళ‌ మీడియాతో ఇంటరాక్ట్ అయిన జాన్వీ తమిళంలో చాలా అనర్గళంగా మాట్లాడి కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చెన్నైలో తనకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని, తన తల్లి శ్రీదేవితో కలిసి ఉన్న మంచి సమయాన్ని గుర్తుచేసుకున్నానని చెప్పింది.

ప్ర‌స్తుతం త‌మిళ అగ్ర ద‌ర్శ‌కులు జాన్వీతో క‌లిసి ప‌ని చేయాల‌ని భావిస్తున్నారు. జాన్వీ త‌మిళ యాక్సెంట్ విన్న త‌ర్వాత త‌న‌కు వెంట‌నే అవ‌కాశాలు ఇస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా తార‌క్- జాన్వీ జంట చెన్నై లో త‌మ భాషా ప్రావీణ్యం ప్ర‌ద‌ర్శించ‌డం దేవ‌ర‌కు క‌లిసొస్తుంద‌నే భావిద్దాం. దేవరలో జాన్వీ పల్లెటూరి పిల్ల తంగం పాత్రను పోషించింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version