సూపర్ స్టార్ రజినీకాంత్ ని తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసిన సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రజిని స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది. ఐతే ఆ సినిమా తర్వాత రీసెంట్ గా వేట్టయ్యన్ తో మరోసారి ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చాడు రజిని. ప్రతుతం సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా అంచనాలను మించి ఉంటుందని తెలుస్తుంది.
ఈ సినిమా తర్వాత మళ్లీ నెల్సన్ తోనే జైలర్ 2 ఫిక్స్ చేసుకున్నారు రజిని. ఐతే దీనికి సంబందించిన ప్రోమో రెడీ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. జైలర్ 2 కి సంబందించిన గ్లింప్స్ కోసం నెల్సన్ ఇప్పటికే ప్లాన్ చేశారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 5న ఈ ప్రోమో షూట్ చేస్తారట. ప్రోమో షూట్ చేసి తలైవా రజినీకాంత్ బర్త్ డే రోజు అంటే డిసెంబర్ 12న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అంతకుముందే విక్రమ్ తో కమల్ హాసన్ సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు.
ఐతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ హీరోకి అలాంటి మాస్ హిట్ కావాలని అనుకున్నారు. అప్పుడే నెల్సన్ జైలర్ సినిమా చేశాడు. జైలర్ సినిమాతో రజిని సృష్టించిన సంచలనాలు తెలిసిందే. సరైన సినిమా పడితే రజిని సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో జైలర్ తో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక ఇదే జోష్ తో జైలర్ 2 కథను సిద్ధం చేశాడు నెల్సన్.
సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే జైలర్ 2 సినిమాలో కూడా రజిని మార్క్ మాస్ అంశాలతో పాటు నెల్సన్ మార్క్ డైరెక్షన్ ఉంటుందని తెలుస్తుంది. కూలీ సినిమా 2025 సమ్మర్ కి రిలీజ్ టార్గెట్ చేస్తున్నారు. అందుకే జైలర్ 2 సినిమాను స్లోగానే మొదలు పెట్టబోతున్నారు. రజినీకాంత్ కూడా తన జైలర్ సీక్వెల్ మీద ఆసక్తికరంగా ఉన్నట్టు తెలుస్తుంది.
జైలర్ సినిమా కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. కూలీ సినిమా పూర్తి చేయడమే ఆలస్యం రజిని జైలర్ 2 కి డేట్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరి జైలర్ రేంజ్ లో జైలర్ 2 ఉంటుందా లేదా దాన్ని మించి ఉంటుందా అన్నది చూడాలి.