Advertisement

దత్‌ కాళ్లు బిగ్‌బి మొక్కడంపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్‌

Posted : June 20, 2024 at 7:19 pm IST by ManaTeluguMovies

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు రెడీగా ఉంది. మరో వారం రోజుల్లో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ముంబైలో నిన్న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించడం జరిగింది.

చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ వేడుకలో నిర్మాత అశ్వినీదత్‌ కాళ్ల ను బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ మొక్కడం చర్చనీయాంశం అయ్యింది. అంతటి గొప్ప స్టార్‌ నటుడు అయిన అమితాబ్‌ ఎందుకు అశ్వినీదత్‌ కాళ్లు మొక్కాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలు అయ్యింది.

అందుకు సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. ఇలాంటి వైరల్‌ విషయాలు, ట్రెండింగ్‌ టాపిక్స్ పై రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించడం చాలా కామన్‌ విషయం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పైగా అమితాబ్ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్‌ అయ్యాడు కనుక వెంటనే ఆర్జీవీ స్పందించాడు. అమితాబచ్చన్‌ ఇలా చేయడం అనేది అశ్వినీదత్‌ సాధించిన విజయాల్లో అత్యుత్తమమైనది. ఎన్టీఆర్‌ నుంచి ఇప్పటి తరం హీరోల వరకు ఏ ఒక్కరు కూడా ఇలా చేసి ఉండరు.

ఇక అమితాబ్‌ తన కెరీర్ మొత్తం కూడా ఇలా ఒక నిర్మాతకు చేయడం నేను చూడలేదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ వర్మ ట్వీట్‌ చేశాడు. తెలుగు నిర్మాతకు అమితాబ్ ఇలా చేయడం ఏంటి అంటూ ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

విద్యా కానుక కిట్ల కొనుగోళ్లలో ఉల్లంఘనలు | Violations in Purchase of Vidya Kanuka Kits

Posted : July 16, 2024 at 6:54 pm IST by ManaTeluguMovies

విద్యా కానుక కిట్ల కొనుగోళ్లలో ఉల్లంఘనలు | Violations in Purchase of Vidya Kanuka Kits

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement