కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ దేవర సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అనించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమాలో ప్రధానంగా చెప్పుకునే అంశాల్లో అనిరుద్ మ్యూజిక్ కూడా ఉంది. తెలుగులో ఇప్పటికే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న అనిరుద్ కి స్టార్ సినిమా అది కూడా సూపర్ బజ్ తో రావడం ఇదే మొదటిసారి. పవర్ స్టార్ తో అజ్ఞాతవాసి చేసినా ఎందుకో దానికి న్యాయం చేయలేకపోయాడు. దేవర సినిమాకు మాత్రం అనిరుద్ ఆన్ అండ్ ఆఫ్ మంచి బజ్ క్రియేట్ చేశాడు. దేవర ఇంటర్వ్యూస్ లో కూడా ఇంతవరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించిన అనిరుద్ రిలీజ్ నాడు చెన్నైలో సినిమా చూసి కాలర్ ఎగరేశాడు. సినిమా చూసిన అనతరం ఫ్యాన్స్ అంతా కాలర్ ఏగరేస్తారని ఎన్టీఆర్ ఒక వేడుకలో చెప్పాడు. దేవర చూశాక ఎన్ టీ ఆర్ ఫ్యాన్ మాదిరిగా అనిరుద్ కూడా కాలర్ ఎగరేస్తూ కనిపించాడు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా కమిట్మెంట్ విషయంలో డేట్స్ విషయంలో అనిరుద్ కాస్త ఇబ్బంది పెడతాడని అంటారు కానీ ఒక్కసారి కమిట్ అయితే ఎలా ఉంటుందో అతని వర్క్ తో చూపిస్తాడు. దేవర సినిమాకు అనిరుద్ సాంగ్స్, బిజిఎం రెండు హైలెట్స్ గా నిలిచాయి. అంతేకాదు సినిమా గురించి ఎక్కడ మాట్లాడినా సరే ఫ్యాన్స్ ని ఉత్సాహపరచేలా చేశాడు.
ఇక ఎన్టీఆర్ చెప్పినట్టుగా కాలర్ ఎగరేయడం మాత్రం తారక్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తుంది. దేవర సినిమా నేడు మార్నింగ్ బెనిఫిట్ షోస్ నుంచి టాక్ డివైడ్ గా ఉన్నా ఎన్ టీ ఆర్ ఫ్యాన్స్ మాత్రం సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా తెర మీద ఎన్టీఆర్, తెర వెనక అనిరుద్ ఇద్దరు అదరగొట్టారు. కచ్చితంగా అనిరుద్ కెరీర్ లో దేవర మ్యూజిక్ అండ్ స్కోర్ అతని క్రేజ్ డబుల్ అయ్యేలా చేస్తుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా దేవర సినిమాకు హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర 1 లో తారక్ సరసన జాన్వి కపూర్ స్క్రీన్ షేర్ చేసుకుంది. సినిమాలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.