ప్రముఖ తెలుగు నటుడు, మాజీ మా అధ్యక్షుడు శివాజీ రాజాకు గుండె పోటు వచ్చింది. రాత్రి సమయంలో గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. వైధ్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైధ్యులు పేర్కొన్నారు. సీరియస్ గుండె పోటు ఏమీ కాదని వైధ్యులు చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ఆయన సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజాగా ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు మీడియాకు వివరించారు. బీపీ డౌన్ అవ్వడంతో ఒక్కసారిగా గుండె పోటు వచ్చిందని, ఆ సమయంలో పక్కనే కుటుంబ సభ్యులు ఉండటం వల్ల హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు. వైధ్యులు స్టంట్ వేశారు. గతంలో ఎప్పుడు కూడా శివాజీ రాజాకు గుండె పోటు కాని గుండెకు సంబంధించిన ఎలాంటి సమస్యలు లేవు. మొదటి సారి గుండె పోటు రావడం జరిగిందన్నారు.
గత మా అధ్యక్షుడి ఎన్నికల సమయంలో శివాజీ రాజా పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. నరేష్‌తో విభేదాల కారణంగా ఎన్నికల సమయంలో హోరా హోరీ పోరాడారు. అయితే శివాజీ రాజా అప్పటికే ఒకసారి అధ్యక్షుడిగా చేసిన కారణంగా నరేష్‌కు ఛాన్స్ ఇవ్వాలని పలువురు భావించారు. దాంతో మొన్నటి ఎన్నికల్లో శివాజీ రాజా ఓడిపోయి నరేష్ గెలిచాడు. శివాజీ రాజా ఈమద్య కాలంలో సినిమాల్లో కూడా తక్కువ నటిస్తున్నాడు. తన ఫార్మ్ హౌస్‌లో వ్యవసాయం చేసుకుంటూ టైం గడుపుతున్నారు.