Advertisement

నాగ్ అశ్విన్.. కల్కి 2 తరువాత అమెతోనే..?

Posted : November 11, 2024 at 2:24 pm IST by ManaTeluguMovies

‘కల్కి 2898ఏడీ’ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన నాగ్ అశ్విన్ కి దేశ వ్యాప్తంగా మంచి ఇమేజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ‘కల్కి’ చిత్రాన్నీ ఫస్ట్ ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా తెరపై ఆవిష్కరించి నాగ్ అశ్విన్ విజయం సాధించారు. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన విధానానికి కూడా బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి అభినందనలు లభించాయి.

దీపికా పదుకునే ఫస్ట్ తెలుగు సినిమాగా ‘కల్కి 2898ఏడీ’ నిలిచింది. ఆమె క్యారెక్టర్ కూడా అద్భుతంగా క్లిక్కయ్యింది. దీపికా పదుకునే తర్వాత మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో నాగ్ అశ్విన్ వర్క్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన అలియా భట్ కి రీసెంట్ గా నాగ్ అశ్విన్ ఓ లేడీ ఒరియాంటెడ్ స్టోరీ నేరేట్ చేసాడంట. ఈ కథ ఆమెకి బాగా నచ్చేసిందని, చేయడానికి ఒకే చెప్పిందని బిటౌన్ లో వినిపిస్తోంది.

బాలీవుడ్ లో ఓ బడా ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధంగా ఉందనే ప్రచారం నడుస్తోంది. అలాగే లేడీ ఒరియాంటెడ్ మూవీ అయిన భారీ ప్రాజెక్ట్ గా ఈ ఈ మూవీ ఉండబోతోందని అనుకుంటున్నారు. ‘కల్కి 2898 పార్ట్ 2’ కంప్లీట్ చేసిన తర్వాత ఈ మూవీని నాగ్ అశ్విన్ స్టార్ట్ చేసే అవకాశం ఉందంట.

నెవ్వర్ ఎక్స్ పెక్టేడ్ స్టోరీతోనే లార్జ్ స్కేల్ లో ఈ కథని నాగ్ అశ్విన్ చెప్పాలని అనుకుంటున్నాడంట. అలియా భట్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఇప్పటికే హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. కచ్చితంగా నాగ్ అశ్విన్ చెప్పిన కథ ఫైనల్ అయితే ఫీమేల్ ఒరియాంటెడ్ చిత్రాలలో అతి పెద్ద సినిమా అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ‘కల్కి పార్ట్ 2’ కథ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

2025 ఆఖరులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి 2028లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉందంట. దాని తర్వాత అలియా భట్ కి చెప్పిన స్టోరీని తెరకెక్కించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అలియా భట్ హిందీలో ‘లవ్ అండ్ వార్’ అనే చిత్రంలో నటిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా నటిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Eknath Shinde Takes Oath As Maharashtra Deputy CM

Posted : December 5, 2024 at 7:00 pm IST by ManaTeluguMovies

Eknath Shinde Takes Oath As Maharashtra Deputy CM

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad