Advertisement

నాని మూవీ… రూమర్స్ వద్దు ప్లీజ్‌

Posted : September 2, 2024 at 9:52 pm IST by ManaTeluguMovies

నేచురల్‌ స్టార్‌ నాని బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌ లతో దూసుకు పోతున్నాడు. తాజాగా వచ్చిన సరిపోదా శనివారం సినిమా కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మంచి ఓపెనింగ్స్ వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదల కారణంగా కాస్త డల్ అయింది. పరిస్థితి కుదుట పడ్డ తర్వాత మళ్లీ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో నాని తదుపరి సినిమా గురించి సోషల్‌ మీడియాలో పుకార్ల మీద పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నాని తదుపరి సినిమా ఇప్పటికే శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో అంటూ కన్ఫర్మ్‌ అయ్యింది. గత సంవత్సరం నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే కమర్షియల్‌ గా మాత్రం ఆశించిన స్థాయిలో సంతృప్తి పరచలేక పోయింది. దసరా పాన్‌ ఇండియా భారీ హిట్‌ ను సొంతం చేసుకుంటుందని భావిస్తే ప్రశంసల వరకు వచ్చి, కలెక్షన్ తగ్గాయి. కానీ ఈసారి ఏమాత్రం తప్పు జరగకుండా నానితో ఒక కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ ను తీసేందుకు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.

సినిమా గురించి ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం, సినిమా గురించి వస్తున్న పుకార్ల గురించి చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి స్పందన వచ్చింది. సినిమా గురించి తప్పుడు ప్రచారం వ్యాప్తి చేయవద్దంటూ టీం ఒక ప్రెస్‌ నోట్‌ ను విడుదల చేయడం జరిగింది. అందులో… సినిమా గురించి పుకార్లు ప్రచారం చేయడం ద్వారా ఆసక్తి దెబ్బతింటుంది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. నాని – ఓదెల కాంబోలో వస్తున్న సినిమాకు మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. పాన్‌ ఇండియా రేంజ్ లో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేము ప్లాన్‌ చేస్తున్నాం.


Advertisement

Recent Random Post:

ఖైరతాబాద్ గణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ | CM Revanth Reddy Visit Khairatabad Ganesh

Posted : September 7, 2024 at 2:35 pm IST by ManaTeluguMovies

ఖైరతాబాద్ గణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ | CM Revanth Reddy Visit Khairatabad Ganesh

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement