Advertisement

నిహారిక గ్యాంగ్ గ్లామర్ బ్లాస్ట్

Posted : November 4, 2024 at 1:56 pm IST by ManaTeluguMovies

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మడు.. అనేక షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి వంటి పలు లఘచిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత యంగ్ హీరో నాగచైతన్య ఒక మనసు మూవీతో హీరోయిన్ గా మారారు. డెబ్యూ చిత్రంలో తన యాక్టింగ్ తో అలరించారు. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కించుకున్నారు.

ఆ తర్వాత హీరోయిన్ గా వరుస సినిమాలు చేశారు నిహారిక. కానీ అనుకున్నంత స్థాయిలో హిట్స్ సాధించలేకపోయారు. సూర్య కాంతం మూవీతో మోస్తరు హిట్ ను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు. తన బ్యానర్ పై పలు వెబ్ సిరీస్ లు నిర్మించారు. రీసెంట్ గా కమిటీ కుర్రోళ్ళు సినిమాను రూపొందించారు. ఆగస్టులో రిలీజ్ అయిన ఆ మూవీ సూపర్ హిట్ అయ్యి నిర్మాతగా నిహారికకు సక్సెస్ తెచ్చి పెట్టింది.

ఓవైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే.. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు నిహారిక. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తో కలిసి వాటి ది ఫిష్ లో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయి ఆకట్టుకుంది. కోలీవుడ్ లో మరో సినిమా చేస్తున్నారు మెగా డాటర్.

మద్రాస్ కారన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళం హీరో ఆర్డీఎక్స్ ఫేమ్ షేన్ నిగమ్ సరసన నటిస్తున్నారు. అదే సమయంలో తన ఫ్రెండ్స్ తో ఎప్పటికప్పుడు వెకేషన్స్ అండ్ పార్టీస్ కు హాజరవుతుంటారు నిహారిక.

ఈ మధ్యకాలంలో వితికా షేరు, మహాతల్లి జానుతో నిహారిక ఎక్కువ కనిపిస్తున్నారు. టూర్స్ కు వెళ్తున్నారు. పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ ఎవరో ఒకరు ఇన్స్ స్టాలో షేర్ చేస్తున్నారు. వాటి కింద కామెంట్స్ తో తమ ఫ్రెండ్ షిప్ ను వ్యక్తపరుస్తున్నారు. రీసెంట్ గా మహాతల్లి జాను కొత్త పిక్ ను షేర్ చేశారు. అంతా కలిసి బ్రంచ్ కు వెళ్లినట్లు క్యాప్షన్ ఇచ్చారు. అంతా ఫుల్ ఫన్నీగా గడుపుతూ ఫోటో దిగినట్లు ఈజీగా తెలుస్తుంది. అందులో నిహారిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.

వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న మెగా డాటర్ తన నవ్వుతో మాయ చేస్తున్నారు. తన స్టిల్స్ ఫిదా చేస్తున్నారు. సింపుల్ గా కనిపిస్తూనే ఆకట్టుకుంటున్నారు. తన లుక్స్ తో మైమరపిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారగా.. నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. నిహారిక గ్యాంగ్ పిక్ సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు. గ్లామర్ బ్లాస్ట్ అదిరిపోయిందని చెబుతున్నారు.


Advertisement

Recent Random Post:

భారత అమ్ముల పొదిలోకి నాగాస్త్ర-1 | Army Gets Nagastra-1| India’s First Indigenous Suicide Drone

Posted : December 3, 2024 at 8:23 pm IST by ManaTeluguMovies

భారత అమ్ముల పొదిలోకి నాగాస్త్ర-1 | Army Gets Nagastra-1| India’s First Indigenous Suicide Drone

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad