Advertisement

పాయ‌ల్ రాజ్ పుత్ పై డైరెక్ట‌ర్ సీరియ‌స్!

Posted : November 16, 2023 at 5:28 pm IST by ManaTeluguMovies

హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ పై డైరెక్ట‌ర్ సీరియ‌స్ అయ్యాడా? నువ్వు వెళ్లోంది త‌ప్పుడు దారిలోన‌ని మంద‌లించాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇంత‌కీ పాయల్ పై సీరియ‌స్ ఎందుకు అవ్వాల్సి వ‌చ్చింది. అత‌ను ఎవ‌రు? అంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. పాయ‌ల్ రాజ్ పుత్ ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చింది అజ‌య్ భూప‌తి.

ఆయ‌న వ‌ల్లే న‌టి అయింది. ఆ సినిమాకి ఎంతో మంది భామ‌ల్ని ప‌రిశీలించి పాయల్ అయితే బాగుటుం ద‌ని తుదిగా ఎంపిక చేసారు. ఆ సినిమా స‌క్సెస్ అవ్వ‌డంతో పాయల్ టాలీవుడ్ లో బిజీ అయింది. ఆ విజ‌యంతో వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే ఆ ఛాన్సుల‌ను విజ‌యాలుగా మలుచుకోవ‌డంలో పాయ‌ల్ విఫ‌ల‌మైంది. స‌రైన క‌థ‌లు..పాత్ర‌లు ఎంపిక చేసుకోవ‌డంలో త‌ప్ప‌ట‌డుగులు ప‌డ్డాయి.

దీంతో అవ‌కాశాలు త‌గ్గాయి. కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ పాయ‌ల్ తో అజ‌య్ భూప‌తి ‘మంగ‌ళ‌వారం’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా తొలుత కొత్త నాయిక‌ని తీసుకోవాల‌ని చూస్తున్నారుట‌. ఆ ర‌కంగా వెట మొద‌లైన విష‌యం తెలుసుకున్న పాయ‌ల్ అజ‌య్ కి ఫోన్ చేసి ఆఛాన్స్ నాకే ఇవ్వొచ్చు క‌దా అని అడిగిందిట‌. దీంతో ఆలోచించుకుని కొన్ని రోజుల త‌ర్వాత అజ‌య్ ‘ఆఫీస్ లో ఆడిష‌న్స్ జ‌రుగుతున్నాయి.

వ‌చ్చి ఇవ్వు’ అని చెప్పారుట‌. అలా ఆడిష‌న్ ఇవ్వ‌డం..పాత్రకి స‌రిపోవ‌డంతో మ‌రో ఆలోచన లేకుండా మంగ‌ళ‌వారం కోసం పాయ‌ల్ ని ఎంపిక చేసారుట‌. అలా అజ‌య్ త‌నికిచ్చిన సెకెండ్ ఛాన్స్ అని గ‌ర్వంగా చెబుతుంది పాయ‌ల్. అజ‌య్ భూప‌తి కెరీర్ ఆరంభం నుంచి త‌న‌కి ఇండ‌స్ట్రీలో స‌పోర్ట్ గా ఉన్నారుట‌. స‌రైన పాత్ర‌లు ఎంపిక చేసుకోవ‌డంలో త‌ప్పులు జ‌రిగిన‌ప్పుడు ఫోన్ చేసి మంద‌లిం చేవారుట‌. ఎలాంటి పాత్ర‌లు చేయాలి? చేయ‌కూడ‌దు వంటి విలువైన స‌ల‌హాలు ఆయ‌న నుంచి పొందుతాన‌ని పాయ‌ల్ తెలిపింది.


Advertisement

Recent Random Post:

Dhoota Team Int | Prema The Journalist #175 | Full Interview

Posted : November 30, 2023 at 8:51 pm IST by ManaTeluguMovies

Dhoota Team Int | Prema The Journalist #175 | Full Interview

https://www.youtube.com/watch?v=G6Sdhsd659E

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement