పుష్ప 1 సూపర్ హిట్ అవ్వడంతో పుష్ప 2 పై నేషనల్ లెవెల్ లో సూపర్ బజ్ ఏర్పడింది. దానికి తగినట్టుగానే సినిమా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. పాట్నా తో మొదలై చెన్నై, కొచ్చి ఇలా పుష్ప 2 ఈవెంట్స్ కి భారీ రెస్పాన్స్ వస్తుంది. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో భారీ రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే అదే టైం కు అంటే డిసెంబర్ 6న బాలీవుడ్ లో ఛావా సినిమా రిలీజ్ అనుకున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిస్తున్నారు.
సినిమాలో విక్కీ కశౌల్, రష్మిక ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను డిసెంబర్ రేసు నుంచి తప్పించారు. ఛావా సినిమాను డిసెంబర్ 6 నుంచి వాయిదా వేసి ఫిబ్రవరి 14కి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే డిసెంబర్ 5న పుష్ప 2 వస్తుండటంతో ఈ సినిమాకు ఎఫెక్ట్ పడుతుందని ఛావాని వాయిదా వేశారు. సో ఛావా పోస్ట్ పోన్ అవ్వడంతో పుష్ప 2 కి ఉన్న ఒక్క అడ్డు కూడా తొలగి సోలో రిలీజ్ అవుతుంది.
పుష్ప 2, ఛావా రెండు సినిమాలకు ఒకే హీరోయిన్. డిసెంబర్ 6న ఛావా వస్తే 5న పుష్ప 2లో, ఛావాలో రష్మికనే చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఛావా సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చింది. ఇక పుష్ప 2 సినిమాకు నేషనల్ వైడ్ గా ఉన్న బజ్ తెలిసిందే. బాలీవుడ్ లో సోలో రిలీజ్ దొరకడంతో సినిమాకు మరింత ప్లస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.
పుష్ప 2 సినిమా రికార్డ్ ఫస్ట్ డే వసూళ్లను టార్గెట్ పెట్టుకుంది. ఆందుకే డిసెంబర్ 5న దేశమంతా కూడా పుష్ప రాజ్ మేనియా కనిపించేలా సాధ్యమైనంత వరకు ఎక్కువ థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా ట్రైలర్ నుంచి సినిమాపై అంచనాలు పెరగగా రిలీజ్ అవుతున్న సాంగ్స్ ఆ బజ్ ని మరింత పెంచుతున్నాయి.
ఇక సెన్సార్ నుంచి వచ్చిన టాక్, పుష్ప టీం ఫస్ట్ కాపీ నుంచి వచ్చిన టాక్ అదిరిపోయింది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే పుష్ప 2 టాలీవుడ్ నుంచి మరో 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుందని చెప్పొచ్చు. మరి బాక్సాఫీస్ పై పుష్ప రాజ్ దూకుడు ఎలా ఉంటుందో డిసెంబర్ 5న తెలుస్తుంది.