Advertisement

ప్రభాస్ కు పోటీగా బాలీవుడ్ స్టార్ కపుల్స్.. సెట్టయితే కేక..

Posted : September 26, 2024 at 10:12 pm IST by ManaTeluguMovies

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలలో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోన్న మూవీ ‘స్పిరిట్’ అని చెప్పొచ్చు. ‘యానిమల్’ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా చేయబోయే మూవీ ఇదే కావడంతో ఈ చిత్రంపైన ఎక్కువ ఫోకస్ పడింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ చేస్తున్నాడు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.

కాని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ‘స్పిరిట్’ సినిమా కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ‘స్పిరిట్’ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ లో ఉన్నారు. ‘కల్కి’ తర్వాత ప్రభాస్ మార్కెట్ వేల్యూ పెరగడంతో ‘స్పిరిట్’ మూవీ కోసం బడ్జెట్ కూడా పెంచారంట. అలాగే సినిమాలో కీలక పాత్రల కోసం స్టార్ యాక్టర్స్ ని సందీప్ రెడ్డి వంగా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇక ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్ కి ప్రతినాయకుడిగా ఎవరు కనిపించబోతున్నారు అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది.

నిజానికి ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. పవర్ ఫుల్ మాఫియా డాన్ గా మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ లో ప్రభాస్ నటించబోతున్నాడు అనే టాక్ వినిపించింది. అయితే ఇది ఎంత వరకు వాస్తవమనేది తెలియదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది. ‘స్పిరిట్’ చిత్రంలో విలన్స్ గా బాలీవుడ్ స్టార్ కపుల్స్ ని ఎంపిక చేయాలని సందీప్ రెడ్డి వంగా అనుకుంటున్నారంట.

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ తో పాటు అతని భార్య కరీనా కపూర్ ని ‘స్పిరిట్’ సినిమా కోసం సంప్రదించారని బిటౌన్ లో ఒక టాక్ వినిపిస్తోంది. నిజానికి కరీనా కపూర్ ని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం అడిగారని టాక్ వచ్చింది. అయితే సైఫ్ అలీఖాన్ తో పాటు కరీనా కపూర్ ని కూడా నెగిటివ్ రోల్స్ కోసమే తీసుకోవాలని ప్లాన్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది.

‘స్పిరిట్’ సినిమాలో వారిద్దరి కోసం అనుకుంటున్న క్యారెక్టర్స్ ను దర్శకుడు పవర్ ఫుల్ గా డిజైన్ చేశారనే మాట వినిపిస్తోంది. అయితే ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేంత వరకు వేచి చూడాలి. ప్రస్తుతం దర్శకుడు పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో క్యాస్టింగ్ ను ఫైనల్ చేసి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.


Advertisement

Recent Random Post:

మ్యారేజీపై క్లారిటీ ఇచ్చిన మాధురి | Divvela Madhuri Gives Clarity On Her Marriage With Srinivas

Posted : October 8, 2024 at 12:02 pm IST by ManaTeluguMovies

మ్యారేజీపై క్లారిటీ ఇచ్చిన మాధురి | Divvela Madhuri Gives Clarity On Her Marriage With Srinivas

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad