ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బాలయ్య వివాదం.. అక్కడి వరకు వెళ్లిందా.

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఫుల్ ట్రోల్స్ ఎదుర్కుంటారు. తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. అనేక మంది పలు విధాలుగా కామెంట్స్ పెడుతున్నారు. బాలయ్య అలా చేయడం అసలు కరెక్ట్ కాదని అంటున్నారు. చాలా తప్పు అని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే?

ఇటీవల యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హీరో బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో న‌టి అంజ‌లిని బాలకృష్ణ నెట్టివేయడం వివాదానికి దారి తీసింది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్ల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు బాల‌య్య‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మూవీ టీమ్.. దీనిపై క్లారిటీ ఇచ్చినా విమర్శలు ఆగడం లేదు.

తాజాగా బాల‌య్యపై బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు హన్సల్ మెహతా విమ‌ర్శ‌లు గుప్పించారు. అంజలిని నెట్టివేస్తున్న వీడియోను షేర్ చేసి ఎవరీ సంస్కారం లేని మనిషి అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత ఆయన టాలీవుడ్ సీనియర్ హీరో అని, ఎమ్మెల్యే అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. దీంతో స్కం బ్యాగ్*100 అని మరో పోస్ట్ చేశారు హన్సల్ మెహతా. ప్ర‌స్తుతం ఆయన పోస్టులు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

మరోవైపు, ఇదే వేడుకలో బాలకృష్ణ కాళ్ల దగ్గర మందు కలిపిన బాటిల్ ఉన్నట్లు వీడియో బయటికి రావడంతో మరో చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ నడుస్తోంది. అయితే బాలకృష్ణ కాళ్ల దగ్గర ఉన్న మందు బాటిల్ కేవలం ఎడిట్ చేసినదని చెప్పారు నిర్మాత నాగ వంశీ. అంజలిని కూడా ఫ్రెండ్లీగా తోసారని తెలిపారు. అయినప్పటికీ వివాదం మాత్రం ఆగడం లేదు. ఇక బాలయ్య ఎప్పుడు కూడా ఇలాంటి కాంట్రవర్సీ లను పట్టించుకోరని తెలిసిన విషయమే.

ప్రస్తుతం బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో NBK 109 సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకుంది. దసరా కానుకగా ఈ చిత్రం రిలీజ్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏపీ ఎన్నికల వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన బాలయ్య.. మళ్ళీ జాయిన్ అవ్వనున్నారు. NBK 109 తర్వాత బోయపాటి శ్రీనుతో బాలయ్య వర్క్ చేయనున్నారని సమాచారం. ఏదేమైనా అంజలిని బాలయ్య నెట్టిన విషయంలో ట్రోల్స్ ఎప్పుడు ఆగుతాయో చూడాలి.

Exit mobile version