Advertisement

బౌన్స్ బ్యాక్ అయ్యేలా సుధీర్ బాబు పవర్ఫుల్ ప్లాన్!

Posted : November 14, 2023 at 5:42 pm IST by ManaTeluguMovies

ఘట్టమనేని అల్లుడు సుధీర్ బాబు కెరీర్ మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా ఏదో ఒక పాయింట్ డిఫరెంట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. ఇక సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా అతని ప్రయోగాలు మాత్రం అసలు ఆగడం లేదు.

సుధీర్ బాబు ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ సక్సెస్ అందుకొని మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఈ నటుడు బాక్సాఫీస్ వద్ద మూడు పరాజయాల పరంపరను చూసినప్పటికీ, ప్రస్తుతం రెండు మంచి ప్రాజెక్ట్‌లు విడుదలకు లైన్ లో ఉన్నాయి. సుధీర్ బాబుకు ఆ సినిమాలు బాగా కలిసొచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది.

‘లూజర్’ వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన మా నాన్న సూపర్ హీరో లో సుధీర్ బాబు డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. తండ్రీ కొడుకుల డ్రామాగా తెరకెక్కుతున్న ఈ. సినిమాపై ఇండస్ట్రీతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ పాజిటివ్ బజ్ నడుస్తోంది. వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు.

అలాగే హరోమ్ హర అనే మరో సినిమాపై ఇదివరకే సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. న్జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించింది. సుధీర్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీలో కూడా సమాంతరంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలు 2024 ఫస్ట్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. వరుసగా కొన్ని అపజయాలు చూసిన అనంతరం సుధీర్ బాబు ఇప్పుడు. పవర్ఫుల్ కంటెంట్ ఉన్న సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.


Advertisement

Recent Random Post:

నాగార్జునసాగర్‌ డ్యాంపై కొనసాగుతున్న టెన్షన్ –

Posted : December 1, 2023 at 11:39 am IST by ManaTeluguMovies

నాగార్జునసాగర్‌ డ్యాంపై కొనసాగుతున్న టెన్షన్ –

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement