రెండేళ్ల కిందట వరుస ఫ్లాపులు ఎదురైన సమయంలో తనకు గ్యాప్ అవసరమనిపించిందని.. ఆ సమయంలోనే లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి ఇద్దరు రైటర్లను హైర్ చేసుకుని ఇండియాలో జరిగిన ఐటీ స్కామ్ ఆధారంగా కథ రాయించానని.. హాలీవుడ్ డైరెక్టర్నే పెట్టి ఇంగ్లిష్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని విష్ణు వెల్లడించాడు. ఐతే ఇంగ్లిష్‌లో సినిమా మొదలుపెట్టాక మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇంకొంత ఖర్చు పెట్టి తెలుగులోనూ చేస్తే సేఫ్ కదా అన్నాడని.. దీంతో తెలుగులోనూ సినిమాను మొదలుపెట్టామని విష్ణు వెల్లడించాడు.
ఇంగ్లిష్ వెర్షన్ ఇంగ్లిష్, తెలుగు, హిందీ డైలాగులతో స్లమ్ డాగ్ మిలియనీర్ తరహాలో నడుస్తుందని.. తెలుగు వెర్షన్‌ను ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చామని.. ఫైట్లు, సెంటిమెంట్ సీన్లతో నిడివి ఎక్కువ ఉంటుందని విష్ణు తెలిపాడు. ఐతే ముందు తెలుగు వెర్షన్‌ను జూన్ 5న రిలీజ్ చేయాలనుకుంటున్నామని.. జులైలో యుఎస్‌లో ఓ ఫిలిం ఫెస్టివల్లో సినిమాను ప్రదర్శించి ఏదైనా కార్పొరేట్ సంస్థ కొంటే తర్వాత హాలీవుడ్లో రిలీజవుతుందని ట్విస్టు ఇచ్చాడు విష్ణు.