సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ లో తప్పుడు వార్తలు, పుకార్లు ప్రచారం చేస్తూ, ట్రోల్స్ పేరుతో అసభ్య వీడియోలను క్రియేట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధం అవుతున్నట్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించిన విషయం తెల్సిందే.
మంచు విష్ణు ప్రకటనకు చాలా మంది స్పందించారు. ఇండస్ట్రీలో చాలా మంది విమర్శలు ఎదుర్కొంటున్నారు, తప్పుడు వార్తల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఉన్నారు. వారందరూ కూడా మంచు విష్ణు నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రకటనలు చేయడం జరిగింది.
డిజిటిల్ ప్లాట్ ఫామ్ పై ఉన్న తప్పుడు వార్తలను 48 గంటల్లో తొలగించాల్సిందిగా మంచు విష్ణు ఇచ్చిన మాస్ వార్నింగ్ ను సీనియర్ హీరోయిన్ మీనా కూడా సమర్థించారు. తప్పుడు వార్తలను యూట్యూబ్ ద్వారా జనాల్లోకి తీసుకు వెళ్తున్న వారు కచ్చితంగా శిక్షార్హులు అంటూ మీనా అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీలో ఉన్న నటీనటుల యొక్క సమగ్రతను మరియు వారి యొక్క ప్రైవేట్ లైఫ్ ను కాపాడటం కోసం మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. మా కార్యవర్గం కు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నెగటివ్ కామెంట్స్, సోషల్ మీడియా దాడులను ఎదుర్కొడంలో ఒకరికి ఒకరు మద్దతుగా ఉండాలని మీనా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మా చేస్తున్న ఈ పోరాటం కు తన పూర్తి మద్దతు సహకారం ఉంటుందని మీనా గతంలో మంచు విష్ణు పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ను రీ పోస్ట్ చేయడం జరిగింది. మీనా తో పాటు ఇంకా ఎంతో మంది మంచు విష్ణు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.