దర్శకుడిగా నిరూపించుకుంటే తప్పకుండ సినిమా చేస్తానని నాని మాట ఇవ్వడంతో వివేక్ ఆ కథని అలాగే దాచి ఉంచాడు. ఇప్పుడు నాని తన మాట నిలబెట్టుకుని వివేక్ ఆత్రేయతో అదే కథతో సినిమా చేస్తున్నాడు.
అగ్ర హీరోలు ఇప్పుడు కొత్త దర్శకులతో ప్రయోగాలు చేసేందుకు సాహసించడం లేదు. బిజినెస్ వంద కోట్లు దాటిపోయిన ఈ తరుణంలో వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. యువ దర్శకులకి నాని ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. అందుకే మంచి కథలన్నీ ముందుగా నాని దగ్గరికే వెళ్తున్నాయి.