టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణుకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. స్పెషల్ ఫ్యాన్స్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. విభిన్నమైన కథలు ఎంచుకునే హీరోగా పేరు దక్కించుకున్నారు. మెంటల్ మదిలో, నీది నాదీ ఒకే కథ, రాజ రాజ చోర చిత్రాలతో తెలుగు సినీ ప్రియులను మెప్పించారు. 2024లో ఇప్పటికే ఓం భీమ్ బుష్ తో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు శ్రీవిష్ణు.
ఇప్పుడు స్వాగ్ (SWAG) మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, క్యారెక్టర్ రివీల్ గ్లింప్సెస్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు ఊహించని స్పందన లభించిన విషయం తెలిసిందే. నాలుగు గెటప్స్ లో శ్రీవిష్ణు అదరగొట్టేశారు. తన టాలెంట్ ఏంటో మరోసారి చూపించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్న స్వాగ్ మూవీ.. అక్టోబర్ 4వ తేదీన రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. అయితే స్వాగ్ చిత్రంతో మంచి హిట్ కొడతాడునుకుంటున్న శ్రీవిష్ణు.. రిలీజ్ డేట్ విషయంలో పెద్ద రిస్క్ చేస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు. కంటెంట్ పై నమ్మకం ఉన్నా.. రిస్క్ మాత్రం ఉందని అంటున్నారు. ఎందుకంటే స్వాగ్ మూవీకి వారం ముందు.. వారం తర్వాత థియేటర్లలో భారీ సినిమాలు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర పార్ట్-1.. సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది. మూవీ రిజల్ట్ అదిరిపోతే.. మూడు వారాలపాటు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. ఎక్కడ చూసినా దేవర మ్యానియానే నడుస్తోంది. కానీ దేవర వచ్చిన వారానికే స్వాగ్ రిలీజ్ అవుతోంది. కాబట్టి థియేటర్ల విషయంలో కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని నెటిజన్లు అంటున్నారు. అయితే అక్టోబర్ 11వ తేదీన గోపీచంద్, శ్రీనువైట్ల విశ్వం సినిమా రిలీజ్ అవ్వనుంది.
అంతకుముందు రోజు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయాన్ మూవీ సందడి చేయనుంది. ఈ రెండు సినిమాలు కూడా.. స్వాగ్ వచ్చిన వారం తర్వాత థియేటర్లో రిలీజ్ కానున్నాయి. కాబట్టి అటు దేవర.. ఇటు విశ్వం, వెట్టయాన్ తో స్వాగ్ మూవీకి రిస్క్ ఉండే ఛాన్సులు ఎక్కువ కనిపిస్తున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. కానీ కంటెంట్ మీద నమ్మకంతో మేకర్స్ పెద్ద ఛాలెంజ్ కు సిద్ధమైనట్లు తెలుస్తోందని అంటున్నారు. మరి స్వాగ్.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.