ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మా మహేష్ నవ్వాడు.. థాంక్యూ బాలయ్య

సూపర్ స్టార్ కృష్ణ తో ఆయన కుటుంబ సభ్యులతో పాటు మొత్తం ఇండస్ట్రీ తీవ్ర దుఖః లో ఉంది. సినిమా మరియు రాజకీయ ప్రముఖులు వందల సంఖ్యలో కృష్ణ మృతికి సంతాపం తెలియజేస్తూ.. మహేష్ బాబుకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కూడా కృష్ణ మృతికి సంతాపం తెలియజేశారు.

ఆ సందర్భంగా బాలకృష్ణ కొద్ది సమయం పాటు మహేష్ బాబుతో ముచ్చటించారు. బాలకృష్ణ అక్కడ ఉన్న సమయంలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రావడం కూడా జరిగింది. బాలయ్య ఉన్నంత సమయం కూడా మహేష్ బాబు ను ఓదార్చుతూ కాస్త నవ్వించే విధంగా మాట్లాడినట్లుగా లైవ్ విజువల్స్ చూస్తూ అర్థం అవుతుంది.

తండ్రి మృతి చెందిన దుఃఖం లో ఉన్న మహేష్ బాబు నిన్నటి నుండి శోఖం లో ఉన్నాడు. మహేష్ బాబు మౌనం గా ఏడుస్తూ ఉండి పోయాడు. ఆయన మొహం లో ఎప్పుడు కూడా చిరు నవ్వు ఉండేది. కానీ నిన్నటి నుండి మహేష్ బాబును విషాద వదనం లో చూడటం జరిగింది.

బాలకృష్ణ పరామర్శించిన సందర్భంగానే ఏం జోక్ వేశాడో లేదంటే ఏం సరదా ముచ్చట చెప్పాడో కానీ మహేష్ బాబు మొహం లో నవ్వు కనిపించింది. కేవలం మహేష్ బాబు మాత్రమే కాకుండా అక్కడే ఉన్న గౌతమ్ కృష్ణ కూడా కాస్త ఎక్కువగానే నవ్వడం చూడవచ్చు.

మహేష్ బాబు మరియు గౌతమ్ లను బాలయ్య నవ్వించడంతో సోషల్ మీడియాలో ఆ విషయమై వైరల్ అవుతోంది.

ఎట్టకేలకు మా మహేష్ బాబు నవ్వాడు.. మీ వల్ల మా బాబు నవ్వాడు అంటూ మహేష్ బాబు అభిమానులు మీమ్స్ ను క్రియేట్ చేసి బాలయ్య కు కృతజ్ఞతలు చెబుతున్నారు. మహేష్ బాబు మరియు బాలయ్య ల మద్య సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెల్సిందే. ఆ మధ్య బాలయ్య షో అన్ స్టాపబుల్ లో మహేష్ బాబు సందడి చేశాడు.

Exit mobile version