ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

యువ హీరోయిన్స్ కి లేని క్రేజ్ ఆమె సొంతం.. ఎందుకంటే..?

రెండు దశాబ్దాలుగా సౌత్ సినిమాల్లో కథానాయికగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది చెన్నై చిన్నది త్రిష కృష్ణన్. తెలుగు, తమిళ భాషల్లో ఒకే రేంజ్ ఫాం కొనసాగించిన త్రిష ఇప్పటికీ అదే రేంజ్ లో దూసుకెళ్తుంది. ముఖ్యంగా కోలీవుడ్ లో అయితే యువ హీరోయిన్స్ కూడా ఆమెను క్రాస్ చేయలేకపోతున్నారు. త్రిష ఏజ్ దాదాపు 40కి దగ్గర పడుతుంది అయినా సరే అమ్మడు ఇప్పటికీ చాలా అందంగా కనిపిస్తుంది.

వయసు తాలూకా ముదురు తనం అసలు ఎక్కడ కనిపించనివ్వట్లేదు. ఆ రేంజ్ లో అమ్మడు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎవరికైనా సరే ఏజ్ మీద పడుతుంటే అందం తగ్గుతుంది కానీ త్రిష ఆ విషయంలో రివర్స్ గా ఉంది. అమ్మడు రోజు రోజుకి మరింత అందంగా కనిపిస్తుంది. కోలీవుడ్ లో పొన్నియిన్ సెల్వన్ 1, 2 సినిమాల్లో నటించిన త్రిష ఆ సినిమాలో మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్ ని కూడా దాటేలా కనిపించింది. ఆ తర్వాత దళపతి విజయ్ లియో సినిమాలో కూడా త్రిష నటించింది.

ఈమధ్య త్రిష సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు అదేదో కొత్త హీరోయిన్ కనిపించినంత క్రేజ్ తెచ్చుకుంటుంది. అదంతా కూడా ఆమె గ్లామర్ సీక్రెట్ అని చెప్పొచ్చు. అంతేకాదు యువ హీరోయిన్స్ తో వెళ్లడం కన్నా కాస్త రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చి త్రిషని హీరోయిన్ గా తీసుకుంటే ఆమె సీనియారిటీ కూడా సినిమాకు హెల్ప్ అవుతుంది కదా అని మేకర్స్ అనుకుంటున్నారు.

ఇక టాలీవుడ్ కి దాదాపు ఏడెనిమిదేళ్లు దూరంగా ఉన్న త్రిష ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఆ సినిమాతో మరోసారి త్రిష తెలుగు ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తుంది. ఇదే కాదు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో కూడా త్రిష డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది. సో అమ్మడి హవా కోలీవుడ్ నుంచి టాలీవుడ్ లో కూడా కొనసాగించబోతుందని చెప్పొచ్చు.

కొత్తగా వచ్చిన హీరోయిన్స్ ఈమధ్య ఒకటి రెండు హిట్లు పడగానే ఫేడవుట్ అవుతున్నారు. వారి మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టలేకపోతున్నారు. ఆ విషయంలో త్రిష లాంటి సీనియర్ హీరోయిన్స్ తీసుకోవడం బెటర్ అన్న ఆలోచన మేకర్స్ కి వస్తుంది. అందుకే ఈమధ్య కొన్ని ప్రత్యేకమైన సినిమాల్లో లెంగ్త్ అంత ఎక్కువగా లేకపోయినా త్రిష లాంటి సీనియర్ స్టార్ హీరోయిన్స్ కి అవకాశం ఇస్తున్నారు. ఐతే వచ్చిన ప్రతి ఛాన్స్ ని త్రిష కాదనకుండా చేయడం వల్లే అమ్మడు ఇప్పటికీ ఈ రేంజ్ ఫాం కొనసాగిస్తుంది.

Exit mobile version