Advertisement

రమ్యకృష్ణపై షూట్..కృష్ణవంశీ కంట కన్నీరు!

Posted : March 18, 2023 at 9:31 pm IST by ManaTeluguMovies

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వహించిన `రంగమార్తాండ` రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకి అన్ని వైపులా పాజిటివ్ టాక్ వస్తోంది. స్సెషల్ షో కి ఆద్యంతం ప్రశంసలు దక్కుతున్నాయి. పరిశ్రమ వర్గమంతా ముక్కకంఠగా హిట్ సినిమా గా పేర్కొంటున్నారు. వంశీ మరోసారి మోషనల్ గా టచ్ చేసారంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. వంశీ ఈజ్ బ్యాక్ అని రంగమార్తాండ అనిపిస్తుందంటూ! ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలో అన్ని పాత్రలకు వంశీ గొప్ప న్యాయం చేసారంటూ అరుదైన పీడ్ బ్యాక్ ఇస్తున్నారు. అలాగే వంశీ సైతం సినిమాని వ్యక్తిగతంగా భావించి వీలైనంతగా ప్రమోషన్ చేస్తున్నారు. సినిమాకి ఆయన పెట్టుబడి పెట్టారని ఇలా ప్రమోట్ చేస్తున్నారా? లేక నిజయాతీగల కంటెంట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని కసితో పనిచేస్తున్నారా? అన్నది పక్కనబెడితే సినిమాకి మాత్రం జెన్యూన్ టాక్ వినిపిస్తుంది.

తాజాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా రమ్యకృష్ణ పాత్రని ఉద్దేశించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. `ఈ కథ నాటకరంగానికి చెందిన ఒక కళాకారుడి చుట్టూ తిరుగుతుంది. నాటకం చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకులకి కలగాలి. అందువల్లనే ఎక్కడా క్రేన్ షాట్స్ – ట్రాలీ షాట్స్ – జిమ్మీ జిప్ షాట్స్ తీయలేదు. ఎమోషన్స్ కోసం ఎక్కువ సమయాన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కువగా టేక్ లు తీసుకున్నాను. పాత్రలన్నీ కూడా చాలా సజీవంగా కనిపిస్తూ ఉంటాయి.

రమ్యకృష్ణ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అలాగని భారీ డైలాగులు ఉండవు. చాలా సెటిల్డ్ పెర్పార్మెన్స్ లో కనిపిస్తుంది. క్లైమాక్స్ లోని ఒక సీన్ ను ఆమెపై షూట్ చేయడానికి చాలా ఇబ్బది పడ్డాడ్డాను. నిజానికి ఆ సీన్ రాస్తున్నప్పుడే చాలా బాధ కలిగింది. ఎంతో హృద్యంగా అనిపించింది. కానీ ఆ సన్నివేశం సినిమా చాలా ముఖ్యం కాబట్టి అన్నింటిని తట్టుకుని రాసాను. ఇక ఆ సీన్ షూట్ చేసేటప్పుడు ఇంకెంత బాధపడ్డానో నాకే తెలుసు. కళ్ల వెంట కనీళ్లొస్తూనే ఉన్నాయి. ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదు. ఒక రకంగా మనసును రాయిచేసుకునే షూట్ చేశాను` అని అన్నారు.


Advertisement

Recent Random Post:

Padutha Theeyaga Latest Promo | Series 21 | 27th March 2023 | SP.Charan, Sunitha

Posted : March 21, 2023 at 1:39 pm IST by ManaTeluguMovies

Watch Padutha Theeyaga Latest Promo | Series 21 | 27th March 2023 | SP.Charan, Sunitha

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement