టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఓవైపు లావణ్య వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న రాజ్ తరుణ్.. మరోవైపు షూటింగ్లను త్వరగా పూర్తి చేస్తున్నారు. అయితే సరైన హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆయన.. రీసెంట్ గా పురుషోత్తముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ భీమన దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
పురుషోత్తముడు సినిమాకు సంబంధించిన ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా రాజ్ తరుణ్ కనిపించలేదు. అయితే మూవీ టైటిల్స్ సమయంలో రాజ్ తరుణ్ పేరు మందు మేకర్స్ జోవియల్ స్టార్ అనే ట్యాగ్ ను యాడ్ చేశారు. జోవియల్ స్టార్ రాజ్ తరుణ్ అని టైటిల్స్ లో వేశారు. అయితే ఇప్పటి వరకు రాజ్ తరుణ్ కు ఎలాంటి ట్యాగ్ లేదు. దీంతో మేకర్స్ రాజ్ తరుణ్ కు ఇచ్చిన జోవియల్ స్టార్ ట్యాగ్ ను చూసి అందరూ కాస్త షాక్ అయ్యారు.
పక్కింటి కుర్రాడి తరహా రోల్స్ లో కనిపించే రాజ్ తరుణ్ కు ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఆ ట్యాగ్ చూస్తే నవ్వొస్తుందని అంటున్నారు. ప్రస్తుతం జోవియల్ స్టార్ ట్యాగ్ కోసం జోరుగా చర్చించుకుంటున్నారు. ఆయన రీసెంట్ మూవీస్ ఒక్కటి కూడా జోవియల్ గా లేదని.. మరెలా జోవియల్ స్టార్ అయ్యాడని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు.
రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ ప్రస్తుతం పబ్లిక్ లో ఉందని.. కాబట్టి జోవియల్ స్టార్ కాలేడని అంటున్నారు. అయితే రాజ్ తరుణ్, లావణ్య కేసు ఇప్పటికి సస్పెన్స్ గానే సాగుతోంది. గత 15 రోజులుగా రోజుకో మలుపు తిరుగుతోంది. ఎవరి తప్పో ఇంకా తేలలేదు. ఏదేమైనా రాజ్ తరుణ్ కొత్త ట్యాగ్ పై రకరకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా జోవియల్ స్టార్ ట్రోల్స్, మీమ్స్ దర్శనమిస్తున్నాయి.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు రాజ్ తరుణ్. ఉయ్యాలా జంపాలా, కుమారి 21 ఎఫ్ వంటి చిత్రాలతో సాలిడ్ హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత కొంతకాలంగా మంచి సినిమాలు లేక.. రాజ్ తరుణ్ గ్రాఫ్ బాగా పడిపోయింది. మళ్లీ ఇప్పుడు వరుసగా సినిమాలను ఆయన లైన్ లో పెడుతున్నారు. మరి రాజ్ తరుణ్.. సరైన హిట్ అందుకుని ఎప్పుడు కమ్ బ్యాక్ ఇస్తారో చూడాలి.