ఈమధ్య పాన్ ఇండియా సినిమాల్లో ఎక్కువగా గ్రాఫిక్స్ వాడుతున్న విషయం తెలిసిందే. విజువల్ వండర్స్ గా తెర మీద అద్భుతాలు ఆవిష్కరించేందుకు ఎక్కువగా వి.ఎఫ్.ఎక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఐతే ఎంత బాగా చూపించినా సరే అవి న్యాచురల్ అందాలను మ్యాచ్ చేయలేవు. ఐతే వెండితెర మీద రియల్ అందాలు అది కూడా ఊహించిన దాన్ని ఊహించిన విధంగా తెరకెక్కించాలంటే అది కొంతమంది వల్లే అవుతుంది. దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నాడు స్టార్ డైరెక్టర్ శంకర్.
శంకర్ సినిమా వస్తుంది అంటే విజువల్ గ్రాండియర్ కంపల్సరీ. కథ కథనాలు ఆయన టేకింగ్ అంతా ఒక లెక్క అయితే విజువల్స్ మరో లెక్క అనిపిస్తాయి. శంకర్ సినిమా అంటేనే భారీతనం అనిపించేలా ఆయన సినిమాలు ఉంటాయి. ఈమధ్యనే భారతీయుడు 2 సినిమా రిజల్ట్ తేడా కొట్టినా ఆయన భారీతనం కనిపించింది. ఐతే త్వరలో రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా శంకర్ మార్క్ విజువల్ ట్రీట్ ఉండబోతుంది.
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి వస్తున్న ప్రచార చిత్రాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. గ్లోబల్ స్టార్ రాం చరణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాంగ్స్ విషయంలో శంకర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అందుకే ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అనిపించేలా చేస్తుంది. జరగండి జరగండి, రా మచ్చా రా లేటెస్ట్ గా నానా హైరానా సాంగ్. సాంగ్ టీజర్స్ తోనే వారెవా అనిపించేస్తున్నారు.
ఈమధ్య ఎక్కువగా గ్రాఫిక్స్ కి అలవాటు పడిన ఆడియన్స్ కు రియల్ విజువల్ ట్రీట్.. అంటే రియల్ లొకేషన్స్ తో ప్రేక్షకుల కళ్లని మ్యాజిక్ చేసేలా ఈ సినిమా ఉండబోతుంది. గేమ్ ఛేంజర్ లో చాలా హైలెట్స్ ఉండగా శంకర్ మార్క్ ఈ గ్రాండియర్ విజువల్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలుస్తుంది. శంకర్ తో కలిసి మొదటిసారి పనిచేస్తున్న థమన్ కూడా ది బెస్ట్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
రాం చరణ్, కియరా అద్వాని జంటగా నటిస్తున్న గేం ఛేంజర్ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ప్రమోషనల్ కంటెంట్ మాత్రం మెగా ఫ్యాన్స్ కు సూపర్ జోష్ అందిస్తుంది. ఆచార్యతో ఊహించని ఫెయిల్యూర్ ఫేస్ చేసిన రాం చరణ్ గేమ్ ఛేంజర్ తో బాక్సాఫీస్ పై సత్తా చాటుతాడా అన్నది చూడాలి.