Advertisement

సాయి పల్లవి క్రేజ్ అట్లుంటది మరి..

Posted : November 2, 2024 at 8:15 pm IST by ManaTeluguMovies

హీరోయిన్ సాయి పల్లవి.. భానుమతి.. ఒక్కటే పీస్ అంటూ ఫిదా మూవీతో టాలీవుడ్ సినీ ప్రియులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో తన మార్క్ యాక్టింగ్ తో అలరించారు. తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. పక్కింటి అమ్మాయిలా మారిపోయారు. అంతలా తన నేచురల్ యాక్టింగ్ తో దగ్గరయ్యారు. ఆ తర్వాత సౌత్ లో అనేక ఆఫర్లు వచ్చినా.. తాను అప్పటికే పెట్టుకున్న లక్ష్మణ రేఖను దాటలేదు. చాలా సెలెక్టివ్ గా కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు.

ఇప్పుడు అమరన్ మూవీతో థియేటర్లలో సందడి చేస్తున్నారు సాయిపల్లవి. దివంగత మేజర్ ముకుంద రాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ లీడ్ రోల్ పోషించారు. ఆయన సతీమణి ఇందు రెబెకా వర్గీస్‌ రోల్ లో సాయిపల్లవి యాక్ట్ చేశారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన అమరన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. భారీ వసూళ్లను రాబడుతోంది.

తమిళంలో శివకార్తికేయన్ మూవీ కనుక అమరన్ మంచి కలెక్షన్లు సాధించడం పెద్ద విషయమేమి కాదు.. కానీ తెలుగులో దూకుడు చూసి ట్రేడ్ పండితులు కూడా షాక్ అవుతున్నారట. ఫస్ట్ డే మార్నింగ్ షోలకు అనేక చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం చూసి అంతా ఆశ్చర్య పోయినట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చిత్రాలతో పోటీ ఉన్నా.. అనేక ప్రాంతాల్లో అమరన్ అదరగొడతుండడం విశేషమనే చెప్పాలి.

అయితే సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్‌ వల్లే అమరన్ కు టాలీవుడ్ లో మంచి వసూళ్లు వస్తున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. నేచురల్ బ్యూటీ సినిమానా మజాకా అని అంటున్నారు. సాయి పల్లవి క్రేజ్ అట్లుంటది మరి అని కామెంట్లు పెడుతున్నారు. సినిమాలో ముద్దుగుమ్మ తన యాక్టింగ్ తో హృదయాలను బరువెక్కించారని చెబుతున్నారు. వేరే లెవెల్ లో యాక్టింగ్ చేశారని అంటున్నారు. తెలుగులో ప్రమోషన్స్ తక్కువే జరిగినా.. సాయి పల్లవి ఫ్యాక్టర్ బాగా పనికొచ్చిందని అంటున్నారు.

అదే సమయంలో రెండేళ్ల క్రితం వచ్చి మంచి హిట్ అయిన మేజర్ మూవీని ప్రస్తావిస్తున్నారు. ఆ సినిమా కూడా దివంగత ఆర్మీ ఆఫీసర్ బయోపిక్ గానే తెరకెక్కి సూపర్ హిట్ అయింది. భారీ వసూళ్లు సాధించింది. కానీ అందులో హీరోయిన్ సయీ మంజ్రేకర్ తన యాక్టింగ్ తో పెద్ద ఎఫెక్ట్ చూపించలేదని, ఇప్పుడు అమరన్ లో సాయి పల్లవి మాత్రం కన్నీళ్లు పెట్టించారని చెబుతున్నారు. అన్ని విధాలుగా సినిమాలో నేచురల్ బ్యూటీ మెప్పించారని అంటున్నారు.


Advertisement

Recent Random Post:

India Successfully Tests K-4 Nuclear-Capable Missile

Posted : December 2, 2024 at 2:05 pm IST by ManaTeluguMovies

India Successfully Tests K-4 Nuclear-Capable Missile

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad