Advertisement

సినిమాలు త‌గ్గినా హీరోయిన్ రేంజ్ ఓరేంజ్ లో!

Posted : November 21, 2023 at 5:31 pm IST by ManaTeluguMovies

హీరోయిన్ గా..బిగ్ బీ ఇంట కోడ‌లిగా ఐశ్వ‌ర్యారాయ్ రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. న‌టిగా సినిమాలు త‌గ్గించినా మార్కెట్ లో డిమాండ్ మాత్రం పీక్స్ లోనే ఉంది. క‌రీనాక‌పూర్..దీపికా ప‌దుకొణే ..క‌త్రినా కైఫ్ లాంటి భామ‌లు రేసులో దూసుకుపోతున్నా…ఐశ్వ‌ర్య ఆ రేంజ్ సినిమాలు చేయ‌క‌పోయినా! ప్రేక్ష‌కాభిమానుల్లో ఎప్ప‌టికీ సంథింగ్ స్పెష‌ల్ అని వివిధ వేదిక‌ల‌పై చాటి చెబుతున్నారు.

అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ఎంత మంది భామ‌లు మెరిసినా?..ఐశ్వ‌ర్యారాయ్ డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపించిం దంటే ఆ ఉత్సాహ‌మే వేరు. ఆ వేడుక‌కే వ‌న్నె తీసుకొచ్చే అందం ఆమె సొంతం. అందుకే బ్రాండింగ్స్ విష‌యంలో ఐశ్వ‌ర్యారాయ్ డిమాండ్ అంత‌కంత‌కు పెరుగుతుందే? త‌ప్ప త‌గ్గిన సంద‌ర్భం లేదు. కొన్ని రిపోర్టుల ప్రకారం ఐశ్వర్య నికర విలువ దాదాపు రూ. 776 కోట్లుగా అంచనా వేయబడింది

దీంతో ఐశ్వ‌ర్యారాయ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత సంపన్నరాలుగా నిలిచారు. పాత్ర ని బ‌ట్టి ఐశ్వ‌ర్యారాయ్ పారితోషికం తీసుకుంటారు. ఒక్కో సినిమాకి 10-12 కోట్లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల కోసం ఒక రోజు అసైన్‌మెంట్ కోసం రూ. 6-7 కోట్లు తీసుకుంటున్నారుట‌. ఇక ఐశ్వర్య కొన్ని అగ్ర భారతీయ -బహుళజాతి బ్రాండ్ ల్ని సైతం ప్ర‌మోట్ చేసి ఏటా బాగానే ఆర్జిస్తున్నారు.

పాజిబుల్ అనే పోషకాహార ఆధారిత హెల్త్‌కేర్ కంపెనీలో రూ. 5 కోట్లకు పైగా పెట్టుబ‌డులు పెట్టారు. అలాగే బెంగళూరులోని పర్యావరణ స్టార్టప్ అంబీలో కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో భాగ‌స్వామిగా ఉన్నారు. మామ గారు సొంత కంపెనీ అయిన ఏబీ సీఎల్ కార్య‌చ‌ర‌ణ‌-ప‌రిపాల‌న‌కు సంబంధించిన వ్య‌వహారాలు ఆమె చూసుకుంటున్నారు. విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకుని భాగ‌స్వామిగా మారారు. ఇలా ర‌క‌ర‌కాల వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెడుతూ ఏటా ఆదాయం అంత‌కంత‌కు రెట్టింపు చేసుకుంటున్నారు. ఐశ్యర్యా రాయ్ సినిమాల్ని మంచిని ఆదాయం వ్యాపారంలో చూస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Revanth Reddy Predictions on Congress Winning Seats : 80 నుంచి 85 సీట్లు కాంగ్రెస్ కు వస్తాయి

Posted : November 28, 2023 at 11:26 am IST by ManaTeluguMovies

Revanth Reddy Predictions on Congress Winning Seats : 80 నుంచి 85 సీట్లు కాంగ్రెస్ కు వస్తాయి

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement