Advertisement

సూర్య.. అసలు గ్యాప్ ఇవ్వట్లేదుగా..

Posted : November 7, 2024 at 2:46 pm IST by ManaTeluguMovies

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నవంబర్ 14న ‘కంగువా’ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. కోలీవుడ్ నుంచి వస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా ఉంది. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సూర్య అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు. వీటికి అద్భుతమైన స్పందన వస్తోంది.

‘సూరరై పొట్రు’, ‘జై భీమ్’ సినిమాలతో సూర్యకి నేషనల్ వైడ్ ఇమేజ్ వచ్చింది. ఈ సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి అద్భుతమైన ఆధరణ సొంతం చేసుకున్నాయి. ‘సూరరై పొట్రు’ మూవీ నేషనల్ అవార్డ్స్ సైతం అందుకుంది. ఈ సినిమాల తర్వాత సూర్య నుంచి పాన్ ఇండియా రేంజ్ లో వస్తోన్న సినిమా కావడంతో ‘కంగువా’ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా ఈ చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీకి 1000 కోట్ల కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.

కాన్సెప్ట్ కూడా మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ఉంది. పవర్ ఫుల్ పీరియాడికల్ యాక్షన్ జోనర్ లో ఈ సినిమాని శివ తెరకెక్కించారు. ఇదిలా ఉంటే దీని తర్వాత తక్కువ గ్యాప్ లోనే సూర్య నుంచి మరో సినిమా కూడా థియేటర్స్ లోకి రానుంది. కంగువా సక్సెస్ అయితే ఆ సినిమాల బిజినెస్ లెక్కలు మారే అవకాశం ఉంది.

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య చేస్తోన్న మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది. ఈ సినిమాని 2025 మార్చిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇది కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతోనే తెరకెక్కినట్లు తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజుకి కోలీవుడ్ లో ఒక బ్రాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాపైన కూడా హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే నటుడు కమ్ దర్శకుడు అయిన ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో కూడా సూర్య ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. 2025 ద్వితీయార్ధంలో ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. అంటే 12 నెలల గ్యాప్ లోనే సూర్య నుంచి 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. నవంబర్ 14న రిలీజ్ కాబోతున్న ‘కంగువా’ మూవీ హిట్ అయితే సూర్య నుంచి నెక్స్ట్ రాబోయే రెండు సినిమాల పైన భారీగా బిజినెస్ జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అదెంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.


Advertisement

Recent Random Post:

‘Have to Be Absolutely Neutral’: SC Asks UP Court Not to Proceed with Sambhal Mosque Suit

Posted : November 30, 2024 at 2:03 pm IST by ManaTeluguMovies

‘Have to Be Absolutely Neutral’: SC Asks UP Court Not to Proceed with Sambhal Mosque Suit

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad