నాగచైతన్య బంగార్రాజు చిత్రంలో కనిపించబోతున్నట్లుగా చాలా రోజులుగానే వార్తలు వస్తున్నాయి. కాని సమంత కూడా ఈ సీక్వెల్లో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సోగ్గాడు లెవల్ లోనే ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తాడని అక్కినేని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రం ఉంటుందని సమాచారం అందుతోంది. నాగార్జున ఈ సినిమాను నిర్మించడంతో పాటు సమంత నటిస్తున్న కారణంగా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేసే విషయమై కూడా ఆలోచిస్తున్నట్లుగా ఆ పీఆర్ చెప్పుకొచ్చాడు. విడుదల విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ఇతర విషయాలపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. గత ఏడాది మజిలీతో హిట్ కొట్టిన అక్కినేని జంట బంగార్రాజులో నటిస్తే మరో హిట్ ఖాయం అంటూ అక్కినేని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.