Advertisement

హ‌బ్బీతో ప‌రిణితి..షాక్ అవుతోన్న ఫాలోవ‌ర్స్!

Posted : November 11, 2023 at 6:10 pm IST by ManaTeluguMovies

రాఘ‌వ్ చ‌ద్దా-ప‌రిణితో చోప్రా పెళ్లి చేసుకున్నాక జంట‌గా మీడియాకి క‌నిపించింది పెద్ద‌గా చోటు చేసుకో లేదు. వెకెష‌న్ కి ప‌రిణితి సోలోగా వెళ్లింది..లేదంటే ప్రెండ్స్ గ్యాంగ్ తో ప్లైట్ ఎక్కుతుంది. ఈ రెండు కుద‌ర‌క‌పోతే అమ్మ‌ని..అత్త‌మ్మ‌ని ఏసుకుని ల్యాండ్ అయిపోతుంది. అంతేగానీ హ‌బ్బీతో మాత్రం పెద్ద‌గా క‌నిపించ‌లేదు. నిజానికి ఆ జోడీ ల‌వ్ లో ఉన్న‌ప్పుడు కూడా మీడియాలో ఎక్కువ‌గా ఫోక‌స్ కాలేదు.

రాఘ‌వ్ చ‌ద్దా యాక్టివ్ ఎంపీ కాబ‌ట్టి! తీసుకోవాల్సిన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని సెలైంట్ గా పెళ్లి చేసుకున్నాడు. ఆ త‌ర్వాత అంతే డీసెంట్ గా ఉంటున్నారు. వెకెష‌న్ కి వెళ్లినా కెమెరా ముందు హైడ్ అవుతున్నారు. దీంతో భ‌ర్త లేకుండా వెకేష‌న్లు ఏంటి? అమ్మ‌డు అంటూ ప‌రిణితిపై స‌ర‌దా కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం. తాజాగా అన్నింటికి తెర దించుతూ ఈసారి ఏకంగా విదేశాల్లో భ‌ర్త‌తోనే ల్యాండ్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది.

అమ్మ‌డు ఇన్ స్టాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. రాఘ‌వ్ చ‌ద్దా-ప‌రిణితి జంట‌గా విదేశీ విధుల్లో ల‌గేజీతో ద‌ర్శ‌న‌మిచ్చారు. ప‌రిణితి బ్లాక్ క‌ల‌ర్ దుస్తుల్లో భుజానికి బ్యాగ్ త‌గ‌లించుకుని ఉండ‌గా..రాఘ‌వ్ చ‌ద్దా స్మార్ట్ లుక్ లో భార్య ప‌క్క‌నే క‌నిపిస్తున్నాడు. చేతిలో బ్యాగ్ ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. చాలా రోజుల త‌ర్వాత భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రు క‌నిపించ‌డంతో! సూప‌ర్ జోడీ..ఇంత‌కాలం ఏమైపోయారు? ప‌రిణితి సోలోగానే క‌నిపించింద‌ని పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోని ఉద్దేశించి ఆస‌క్తిర ట్యాగ్ జోడింది ప‌రిణితి. `దేవుడు నాకు ఇచ్చిన ఉత్తమ బహుమతి నువ్వు నా రాగి అని రాసుకొచ్చింది. ఇంకా మొత్తం మ్యాట‌ర్లోకి వెళ్తే..

నీ మనసు.. తెలివి.. నన్ను ఆశ్చర్యపరుస్తాయి. మీ విలువలు.. నిజాయితీ ..విశ్వాసం నన్ను మంచి మనిషిగా ఉండాలని ప్రేరేపిస్తుంటుంది. కుటుంబం పట్ల మీ నిబద్ధత నన్ను ప్రతిరోజూ ఆశీర్వదించేలా చేస్తుంది. మీరు ఈ ప్ర‌పంచంలో ఉన్న పాతకాలపు పెద్ద మనిషి. నీ ప్రశాంతతే నా ఔషధం. ఈ రోజు అధికారికంగా నాకు ఇష్టమైన రోజు. ఎందుకంటే మీరు ఈ రోజు నా కోసం జన్మించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ హ‌బ్బీకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది.


Advertisement

Recent Random Post:

Hydra Issue Notice To Jayabheri Construction Company | హైదరాబాద్లో హైడ్రా దూకుడు |

Posted : September 8, 2024 at 8:59 pm IST by ManaTeluguMovies

Hydra Issue Notice To Jayabheri Construction Company | హైదరాబాద్లో హైడ్రా దూకుడు |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement