Advertisement

హ‌బ్బీ గురించి స‌గ‌మే చెబితే ఎలా?

Posted : November 15, 2023 at 6:07 pm IST by ManaTeluguMovies

సీనియ‌ర్ న‌టి రాధ కుమార్తె కార్తిక నాయ‌ర్ పెళ్లి పీఠ‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త నెల‌లోనే అమ్మ‌డు ఎంగేజ్ మెంట్ పిక్ షేర్ చేసి స‌ర్ ప్రైజ్ చేసింది. కానీ కాబోయే వాడు ఎలా ఉంటాడు? అత‌ని వివ‌రాలు ఏంటి? ఏం చేస్తాడు? వంటి డేటా ఏది అప్పుడు లీక్ చేయ‌లేదు. కేవ‌లం నిశ్చితార్దం పిక్ తోనే స‌రిపెట్టింది. ఈ నేప‌థ్యంలో తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే హబ్బీ కి సంబంధించిన కొన్ని వివ‌రాలు షేర్ చేసింది.

అత‌ని పేరు రోహిత్ మేన‌న్ అని ప‌రిచ‌యం చేసింది. అత‌డితో చిరున‌వ్వులు దించిస్తూ దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. నిన్ను క‌ల‌వ‌డం అన్న‌ది విధి. నిన్ను ఇష్ట‌ప‌డ‌టం ఓ మ్యాజిక్. మ‌న జీవ‌న ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌డానికి కౌంట్ డౌన్ ప్రారంభించా’ అని రాసుకొచ్చింది. అంత‌కు మించి హ‌బ్బీ వివరాలేవి చెప్ప‌లేదు. అతని వృత్తి ఎంటి? ఏ రంగంలో ఉంటాడు? వంటి వివ‌రాలు కూడా చెబుతుంది అనుకుంటే ఇలా స‌గం డేటానే ఇచ్చింది.

ప్ర‌స్తుతం కార్తిక చేసిన పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. కాబోయే దంప‌తుల‌కు ముందొస్తుగానే అభిమానులు విషెస్ తెలియ‌జేస్తున్నారు.ఇక కార్తిక దాదాపు ఎనిమిదేళ్ల‌గా వెండి తెర‌కు దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ‘జోష్’ సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మ‌డు అటుపై కొన్ని సినిమాల్లో న‌టించింది. కానీ న‌టిగా బిజీ కాలేక‌పోయింది. రాధిక లా పెద్ద హీరో యిన్ అవుతుంద‌నుకున్నా..ఆమె లెగ‌స్సీని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.

ఆ త‌ర్వాత కొన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌లేదు. అవ‌కాశాలు వ‌చ్చిన స‌మ‌యంలో అమ్మ‌డు నిల‌దొక్కుకోలేక‌పోయింది. దీంతో వెండి తెర‌కూ దూరం కావాల్సి వ‌చ్చింది. అలాగే రాధ చిన్న‌కుమార్తె తుల‌సి కూడా కొన్ని సినిమాలు చేసింది. ఆమె కూడా ఇప్పుడంత యాక్టివ్ గా క‌న‌పించ‌డం లేదు.


Advertisement

Recent Random Post:

Bigg Boss Telugu 7 Promo 1 – Day 93 | Contestants Intense Discussions After Nominations | Nagarjuna

Posted : December 5, 2023 at 11:54 am IST by ManaTeluguMovies

Bigg Boss Telugu 7 Promo 1 – Day 93 | Contestants Intense Discussions After Nominations | Nagarjuna

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement