ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అది అమ్మ నాన్న తమిళమ్మాయి 2 అంట!

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ తీస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ ని పూరి తన మార్కు గెటప్ లో చూపిస్తున్నాడు. ఒకే తరహా సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండకి ఇది వెరైటీ సినిమా అవుతుందని భావిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ యువ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రమ్యకృష్ణ హీరో తల్లి పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు మదర్ సెంటిమెంట్ హైలైట్ అవుతుందని అంటున్నారు.

ఈ చిత్ర కథ పూరి గతంలో తీసిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రానికి దగ్గరగా ఉంటుందని సమాచారం. అందులో మాదిరిగానే ఫైట్స్ బ్యాక్ డ్రాప్ కి తల్లి సెంటిమెంట్ జోడించారట. ఇంతవరకు విజయ్ కమర్షియల్ సినిమా ఏది చేయలేదు కనుక ఇది అతడికి న్యూ డైమెన్షన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Exit mobile version