ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అన్నదమ్ములు ఇద్దరు కాదన్న కథతో దేవరకొండ..?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ కు రిజల్ట్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ది ఫ్యామిలీ స్టార్ విషయంలో విజయ్ కాలిక్యులేషన్స్ తప్పడంతో తన నెక్స్ట్ సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత రవికిరణ్ కోలా డైరెక్షన్ లో ఒక సినిమా.. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

రాహుల్ తో ఆల్రెడీ విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమా చేశాడు. డైరెక్టర్ గా అతనికి అదే తొలి సినిమా.. టాక్సీవాలా తర్వాత రాహుల్ సంకృత్యన్ నానితో శ్యామ్ సింగ రాయ్ సినిమా చేశాడు. ఆ సినిమా కూడా దర్శకుడిగా తన టాలెంట్ చూపించేలా చేసింది. శ్యామ్ సింగ రాయ్ తర్వాత రాహుల్ చాలా ప్రయత్నాలు చేశాడు. నందమూరి బాలకృష్ణతో కూడా సినిమా అనుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి.

ఇక విజయ్ దేవరకొండతో చేస్తున్న పీరియాడికల్ మూవీ ముందు రాహుల్ తమిళ హీరోలిద్దరికి వినిపించాడని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు రాహుల్ ఈ కథ చెప్పాడట. కథ నచ్చినా సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కాదనేశాడట. సూర్య కాదన్నాడని అతని సోదరుడు కార్తీకి ఈ కథ వినిపించాడట. కార్తి మాత్రం తనకు సూటవ్వదని చెప్పేశాడట. అలా అన్నదమ్ములు ఇద్దరు కుదరదని చెప్పిన కథని కాస్త మార్చి విజయ్ దేవరకొండకు వినిపించాడట రాహుల్.

ఎలాగు టాక్సీవాలాతో హిట్ ఇచ్చిన కాంబో.. శ్యామ్ సింగ రాయ్ సినిమా తో కూడా మంచి స్టోరీ టెల్లర్ గా ప్రూవ్ చేసుకున్న రాహుల్ కి విజయ్ కన్విన్స్ అయ్యాడని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ 15వ సినిమాగా ఇది వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ స్కేల్ లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. సినిమా వర్క్ అవుట్ అయితే మాత్రం సూర్య, కార్తీ ఇద్దరు కూడా ఒక మంచి ఛాన్స్ మిస్ అయినట్టే లెక్క. కొన్నాళ్లుగా సూర్య డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని ప్రపోజల్ లో ఉన్నా సరైన కథ దొరకట్లేదని అంటున్నారు. ఇలా వచ్చిన ఛాన్స్ వదులుకుంటే ఎలా అని కొందరు అంటున్నారు. మరి విజయ్ తో రాహుల్ చేస్తున్న ఈ భారీ అటెంప్ట్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్నది చూడాలి.

Exit mobile version