ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అల్లు అర్జున్ కామెంట్స్.. బన్నీ వాస్ ప్రెస్ మీట్ పెడతారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఒకే ఒక్క ఘటన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య బాగా గ్యాప్ వచ్చేలా చేసిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు రెండు కుటుంబాల మధ్య వైరం ఉందని టాక్ రాగా.. ఇప్పుడు దూరం మరింత పెరిగిందని చెబుతున్నారు. కానీ ఎవరూ కూడా క్లారిటీ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఎక్కడా స్పందించలేదు. కానీ టాలీవుడ్ నిర్మాతలకు మాత్రం ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

సీనియర్ యాక్టర్ రావు రమేష్ లీడ్ రోల్ లో ఇటీవల మారుతీ నగర్ సుబ్రమణ్యం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మంచి రెస్పాన్స్ అందుకున్న ఆ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగ్గా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్ లు గా వచ్చారు. వేడుకలో భాగంగా తన ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడారు బన్నీ. ‘నాకు ఇష్టమైతే నేనొస్తా. నా మనసుకు నచ్చితే వస్తా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

దీంతో బన్నీ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. అదే సమయంలో రెండు ఫ్యామిలీలకు సన్నిహితుడైన నిర్మాత ఎస్కేఎన్ కు అల్లు అర్జున్ వ్యాఖ్యలపై ఆయ్ మూవీ థ్యాంక్యూ మీట్ లో ప్రశ్న ఎదురైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన ఆయ్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో మేకర్స్.. శనివారం థ్యాంక్యూ మీట్ నిర్వహించగా.. ఎస్కేఎన్ అతిథిగా విచ్చేశారు.

ఆ సమయంలో ఇటీవల అల్లు అర్జున్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి కదా.. వాటిపై స్పందించండని మీడియా ప్రతినిధి అడిగారు. అందుకు ఆయన రెస్పాండ్ అవుతూ.. దానికి బన్నీ వాస్ మరో ప్రెస్ మీట్ పెడతారని తెలిపారు. ఇది ఆయ్ మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్ కనుక.. ఆ విషయంపై అస్సలు మాట్లాడమని ఎస్కేఎన్ చెప్పారు. అంతకుముందు మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య ఏదో జరుగుతుందన్న ప్రశ్నే ఆయనకు బేబీ మూవీ స్పెషల్ ప్రెస్ మీట్ లో ఎదురైంది.

అల్లు అర్జున్ కు మంచి సన్నిహితులు అయిన బన్నీ వాసు.. ఆ విషయంపై చాలా సార్లు క్లియర్ గా క్లారిఫై చేశారని అప్పుడు ఎస్కేఎన్ తెలిపారు. దానిపై తాను మళ్లీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను ఒక మెగా అభిమానినని.. ఆ కాంపౌండ్ లో ఉన్న అందరు హీరోలంటే తనకు ఇష్టమని చెప్పారు. చిరంజీవి గారు అంటే చాలా చాలా ఇష్టమని వెల్లడించారు. అప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా.. ఇప్పుడు బన్నీ వాస్ ప్రెస్ మీట్ పెడతారన్న విషయం వైరల్ అవుతోంది. మరి నిజంగా పెడతారో లేదో మాత్రం తెలియదు.

Exit mobile version