ఈ పాత్రకు ప్రధానంగా కాజల్ అగర్వాల్, అనుష్కల పేర్లు వినిపించాయి. ఐతే రేసులో అనుష్కను వెనక్కినెట్టి కాజల్‌నే ఫైనల్ చేసినట్లు తేలిపోయింది. ఆచార్యలో తనే హీరోయిన్ అంటూ స్వయంగా కాజలే వెల్లడించడం విశేషం.
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఖాళీగా ఉన్న కాజల్ అగర్వాల్.. తాజాగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ కాజల్‌ను మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటని ప్రశ్నించగా చిరు సార్ సినిమాలో చేస్తున్నానని, ప్రస్తుతం షూటింగ్ హోల్డ్‌లో ఉండటం వల్ల.. ఇంటి దగ్గరే సినిమా కోసం రెడీ అయ్యేందుకు వర్క్ చేస్తున్నానని తెలిపింది. దీంతో ఆచార్య హీరోయిన్ విషయంలో క్లారిటీ వచ్చేసినట్లు అయ్యింది.
కెరీర్ ఇప్పుడున్న దశలో కాజల్‌కు ఇది బంపరాఫర్ అనే చెప్పాలి. రెండు మూడేళ్ల కిందటే ఆమె రేంజ్ పడిపోయింది. ఇంతకుముందులా స్టార్లు ఆమెను ప్రిఫర్ చేయట్లేదు. గత మూడేళ్లలో కాజల్ నటించిన పెద్ద సినిమా అంటే ‘ఖైదీ నంబర్ 150’ మాత్రమే. అదే అనుకోకుండా దక్కిన అవకాశం అంటే.. మరోసారి చిరు పక్కన సినిమా చేయడమంటే కాజల్ నక్క తోక తొక్కినట్లే.