అయితే రామ్‌గోపాల్ వర్మకు, ప్రముఖ గేయ రచయిత, కవి, పేరడీ సాంగ్స్ స్పెషలిస్ట్ జొన్నవిత్తల రామలింగేశ్వర రావుకి మధ్య ఏదో విషయంలో మనస్పర్థలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇద్దరూ టీవీ ఛానెళ్లలో ప్రత్యేక్షంగానే బండ బూతులు తిట్టుకున్నారు. ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీస్తూ, వాటి ప్రమోషన్ కోసం వివాదాలు క్రియేట్ చేసి ఆర్జీవీపై బయోపిక్ తీస్తానంటూ ప్రకటించాడు జొన్నవిత్తుల. వర్మ జీవిత చరిత్రకు ‘పప్పు వర్మ’ అంటూ టైటిల్ కూడా ప్రకటించాడు అప్పట్లోనే.
ఏదో హంగామా క్రియేట్ చేయడానికి జొన్నవిత్తుల అలాంటి ప్రకటన చేశాడనుకున్నారంతా. అయితే ఫూల్స్ డేను పురస్కరించుకుని ‘రోజూ గిల్లే వాడు’ పేరుతో వర్మ బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు జొన్నవిత్తుల.
అతి చేయడంలో వర్మకు మించినవాళ్లు ఎవ్వరూ లేరు. అలాంటి వర్మకే స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి, ‘ఎక్స్‌ట్రా స్వ్కేర్’గా నిలిచాడు జొన్నవిత్తుల. తనను మరిచిపోకుండా ఏదో ఇష్యూ లేపి గిల్లడం ఆర్జీవీ అలవాటే! అయితే వర్మకు ఇలాంటివి కొత్తేమీ కాదు. మనోడు విటిని పట్టించుకోను కూడా పట్టించుకోడు.
ఎందుకంటే ఇలా ప్రకటించిన సినిమానల్లా పూర్తి చేసి, రిలీజ్ చేసి ఉంటే రామ్‌గోపాల్ వర్మ సినిమాల సంఖ్య వేలల్లోనే ఉండేది. లాక్ డౌన్ కారణంగా ఫూల్స్ డే మాజాను మరిచిపోయిన జనాలకు ఈ ఇద్దరి మధ్య చర్చ మంచి వినోదాన్ని పంచుతోంది.