ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఇంట్రెస్టింగ్ : సూపర్ స్టార్ సినిమాలో ఐకానిక్ స్టార్ కిడ్

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో అర్హ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అర్హ ఫొటో లేదా వీడియో ఏది వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ క్రేజ్ వల్లే గుణశేఖర్ తన శాకుంతలం సినిమాలో అర్హ ను కీలక పాత్రలో నటింపజేసిన విషయం తెల్సిందే.

శాకుంతలం సినిమా తర్వాత అర్హ మరో సినిమాలో కూడా నటించేందుకు సిద్ధం అవుతుంది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాలో ఒక చిన్నారి పాత్ర కథకు చాలా కీలకంగా ఉంటుందట. ఆ పాత్ర వయసుకు.. అర్హ వయసుకు సరిగ్గా సెట్ అవుతుందని త్రివిక్రమ్ అండ్ కో భావిస్తున్నారట.

అల వైకుంఠపురంలో తో పాటు అంతకు ముందు సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చినందుకు గాను త్రివిక్రమ్ పై అల్లు అర్జున్ కు కచ్చితంగా గౌరవం చాలా ఉంటుంది. ఆయనతో మళ్లీ వర్క్ చేసేందుకు కూడా బన్నీ వెయిట్ చేస్తున్నాడు. అందుకే త్రివిక్రమ్ అడిగితే కచ్చితంగా అల్లు అర్జున్ తన కూతురు అర్హను మహేష్ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటాడు.

మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. పలు కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. సినిమా ఆలస్యం అవుతున్నా కొద్ది పలు మార్పులు చేర్పులు చేస్తూ స్క్రిప్ట్ కు మరింత పదును పెడుతున్న త్రివిక్రమ్ ఈసారి అర్హ ను బరిలో దించే విధంగా స్క్రిప్ట్ ను మార్చారు అంటూ వార్తలు వస్తున్నాయి.

మహేష్ బాబు సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ నటించింది అంటే సినిమాకు కూడా బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. మహేష్ బాబు సినిమా పైగా అల్లు అర్జున్ కూతురు అర్హ నటించింది అంటూ చాలా మంది చాలా పాజిటివ్ గా మాట్లాడుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక మహేష్ బాబు సినిమాలో అర్హ ఉంటే పండగే అన్నట్లుగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ విషయం చాలా ప్రధానంగా చర్చ జరుగుతోంది.

Exit mobile version