ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఎన్టీఆర్ ట్రోలర్స్ కు కస్తూరి కౌంటర్!

కోలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నటి కస్తూరి. ‘గ్యాంగ్ వార్’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తమిళ నటి ఆ తరువాత ‘మెరుపు’ సినిమాతో ఓవర్ డోస్ గ్లామర్ తో టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటూ ఏదో ఒక అలిగేషన్ ని తన భుజాలమీదకు ఎత్తుకుంటూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే టీవీ సీరియల్ ‘ఇంటింటి గృహలక్ష్మి’తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటూ పలు అంశాలపై రియాక్ట్ అవుతున్న కస్తూరి నెట్టింట హాట్ టాపిక్ గా మారుతూ వస్తోంది. తాజాగా అనసూయ ‘ఆంటీ’ వివాదంపై నెటిజన్ లకు కౌంటర్ ఇచ్చిన కస్తూరి ఎద్దులా వున్న కుర్రాళ్లు ఏ మహిళనైనా ఆంటీ అని పిలిస్తే మాత్రం అతని మాటల వెనక దురుద్దేశం వుందని అర్థమని చెప్పుకొచ్చింది. ఇక మంచు లక్ష్మి తెలుగు భాషపై ట్రోల్ చేస్తున్న వారికి సపోర్ట్ గా మాట్లాడి షాకిచ్చింది.

మంచు లక్ష్మి పై వచ్చే ట్రోల్స్ గురించి స్పందిస్తూ . తెలుగుని తెలుగులా మాట్లాడాలని అలా మాట్లాడితేనే బాగుంటుందని ట్రోలర్స్ ని సమర్థించింది. ఇదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేసిన వారికి నటి కస్తూరి కౌంటర్ ఇవ్వడం విశేషం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డుల ప్రదానోత్సం సందర్భంగా అమెరికన్ యాక్సెంట్ లో అక్కడున్న వారిని అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్ ని పలువురు నెటిజన్ లు టార్గెట్ గా ట్రోల్ చేశారు.

దీనిపై నటి కస్తూరి స్పందిస్తూ ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చింది. ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్ పై పలువురు నెటిజన్ లు విమర్శలు చేయడాన్ని కస్తూరి తప్పుబట్టింది. కాలిఫోర్నియాలో జరిగిన ఈవెంట్ లో అమెరికన్ ఇంగ్లీష్ యాసలో మాట్లాడితేనే అక్కడి వారికి అర్థమవుతుందని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చాలా గొప్పగా మాట్లాడారని ప్రశంసలు కురిపించింది.

Exit mobile version