ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఒకే సినిమాకి 27 మంది రచయితలు

ఒక సినిమాకి మహా అయితే ఇద్దరు, ముగ్గురు రచయితలు వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. హాలీవుడ్ సినిమాలకి అయితే రైటర్స్ టీమ్ ఉంటుంది. ఒక కథపై రైటర్స్ ఎక్కువ మంది వర్క్ చేస్తారు. అయితే తెలుగు సినిమాలలో ఇలాంటి ఫార్మాట్ లేదు. ఇద్దరు, ముగ్గురు రచయితలకి మించి ఒక మూవీ మీద వర్క్ చేసిన సందర్భాలు తక్కువే. నిర్మాత తలుచుకుంటే కథలో కొత్తదనం కోరుకుంటే ఎంత మందితో అయిన వర్క్ చేయించే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక తెలుగు సినిమాకి ఏకంగా 27 మంది రచయితలు వర్క్ చేసారంట.

అదే మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. చిరంజీవి, శ్రీదేవి ఈ చిత్రంలో జంటగా నటించారు. అప్పట్లో పెద్ద తుఫాన్ లో కూడా ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు విపరీతంగా తరలి వెళ్లారు. అప్పట్లో టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాలలో ఒకటిగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మూవీ నిలిచింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ బ్రాండ్ ఇమేజ్ ని కూడా ఈ సినిమా టాప్ లో నిలబెట్టింది.

ప్రస్తుతం ‘జగదేకవీరుడు అతులోకసుందరి’ మూవీ సీక్వెల్ చేయాలని అశ్వినీదత్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఎవరితో చేస్తాడనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రం కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశ్వినీదత్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాకి ఏకంగా 27 మంది రచయితలు వర్క్ చేశారని అశ్వినీదత్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఉమ్మడి ఏపీలో సినిమా రిలీజ్ అయ్యే సమయంలో భారీ తుఫాన్. అయిన కానీ థియేటర్స్ కు జనం విపరీతంగా వచ్చారని అశ్వినీదత్ చెప్పుకొచ్చారు.

అలాంటి కథాంశంతో అప్పటి వరకు తెలుగులో సినిమా రాలేదు. ఈ కారణంగానే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి అపూర్వ ఆదరణ లభించిందని చెప్పొచ్చు. అలాగే ఒకే సినిమాకి అత్యధిక మంది రైటర్స్ వర్క్ చేయడం మొదటి సారి జరిగింది. ఈ చిత్రం సమయంలోనే మెగాస్టార్ చిరంజీవితో అశ్వినీదత్ కి మంచి అనుబంధం ఏర్పడిందని అశ్వినీదత్ తెలిపారు. దాంతో తరువాత ఇంద్ర, జై చిరంజీవ సినిమాలు చేశానని అన్నారు.

అలాగే వైజయంతీ మూవీస్ బ్యానర్ లోనే రామ్ చరణ్ టాలీవుడ్ ఎంట్రీ జరిగింది. పవన్ కళ్యాణ్ తో కూడా అశ్వినీదత్ బాలు సినిమాని నిర్మించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ తో అశ్వినీదత్ నిర్మాతగా 50 ఏళ్ళ ప్రస్తానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా యాంకర్ ఝాన్సీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అశ్వినీదత్ ఇంటరెస్టింగ్ విషయాలని పంచుకున్నారు.

Exit mobile version