ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కంగువా.. అసలు సర్ ప్రైజ్ అదేనా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. కంగువా మూవీతో పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా.. దిశా పటానీ హీరోయిన్ గా కనిపించనున్నారు. నవంబర్ 14న థియేటర్స్ లో రిలీజ్ కానుందీ చిత్రం.

పదికి పైగా భాషల్లో విడుదల కానున్న కంగువా మూవీకి గాను ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేపడుతున్నారు మేకర్స్. క్రేజీ అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. మూవీపై రోజురోజుకు బజ్ పెంచుకుపోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. రీసెంట్ గా వచ్చిన రిలీజ్ ట్రైలర్ ఆ అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది.

కంగువా మూవీ రెండు టైమ్ లైన్లలో జరుగుతుందని రిలీజ్ ట్రైలర్ ద్వారా క్లారిటీగా తెలుస్తోంది. సూర్య యోధుడిగా, సామాన్యుడిగా రెండు పాత్రల్లో సినిమాలో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. ఫుల్ యాక్షన్ సీన్స్ తో పాటు మంచి ఎమోషన్స్ కూడా సినిమాలో ఉన్నట్టు క్లారిటీ వచ్చేసింది. అదే సమయంలో సెకెండ్ ట్రైలర్ చివర్లో పాడైన పళ్లతో ఉన్న ఓ వ్యక్తి నోటిని చూపించారు మేకర్స్. ఆ చిన్న క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ రోల్ లో కనిపించనున్నది ఎవరోనని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ పాత్రతో కంగువా మేకర్స్ స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. అయితే ప్రమోషన్ కార్యక్రమాల్లో సూర్య.. ఇప్పటికే కంగువాలో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉందని పలుమార్లు తెలిపారు. ఎలాంటి క్లూ ఇవ్వకుండా దాని కోసం వెయిట్ చేయండని చెప్పారు. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ లో ఆ సర్ప్రైజ్ ను మేకర్స్ చిన్నగా రివీల్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

సూర్య తమ్ముడు, కోలీవుడ్ స్టార్ హీరో కార్తి కంగువాలో క్యామియో రోల్ పోషిస్తున్నట్లు అనిపిస్తోందని చెబుతున్నారు. సెకండ్ ట్రైలర్ లో ఆ బ్లింక్ అండ్ మిస్ షాట్ లో ఉన్నది ఆయనేనని అంటున్నారు. సూర్య చెబుతున్న సర్ప్రైజ్ కూడా అదేనని కామెంట్స్ పెడుతున్నారు. దాంతోపాటు సినిమాలో మేకర్స్.. ఆడియన్స్ కు మరిన్ని సర్ప్రైజ్ లు ఇవ్వనున్నారని చెబుతున్నారు. మరి కంగువాలో కార్తి ఉన్నారో లేదో తెలియాలంటే వేచి చూడాలి.

Exit mobile version