ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కాస్టింగ్‌ కౌచ్‌ గురించి అనుష్క స్పందన

టాలీవుడ్‌ తో పాటు ఇతర సినిమా ఇండస్ట్రీల్లో ఆమద్య మీటూ ఇంకా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. కొత్త వారు ఎంతో మంది కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొంటున్నట్లుగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ప్రస్తుతం స్టార్స్‌గా ఉన్న వారు కూడా ఒకప్పుడు కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లుగా మీటూ అంటూ మీడియా ముందుకు వచ్చారు. పలువురు స్టార్స్‌ ఈ చర్చలో పాల్గొన్నా కూడా అనుష్క మాత్రం ఇన్నాళ్ల వరకు ఈ విషయమై స్పందించలేదు.

నిశబ్దం చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో అనుష్క ఎట్టకేలకు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి క్లారిటీ ఇచ్చింది. తనకు ఎప్పుడు కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం ఎదురు కాలేదని చెప్పుకొచ్చింది. నేను ఎప్పుడు కూడా ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిని కనుక నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టే సాహసం చేయలేదు అన్నారు. కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఒక్క సినిమా పరిశ్రమలోనే కాకుండా పలు ప్రాంతాల్లో వర్కింగ్‌ ప్రదేశాల్లో కూడా ఉందని చెప్పుకొచ్చింది.

మహిళలు ఏ రంగంలో అయినా నిలదొక్కుకోవాలంటే రెండు మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి కఠినమైనది రెండవది రాజీ పడటం. నేను కఠినమైన మార్గంను ఎంచుకున్నాను. నా మార్గంలో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని చెప్పుకొచ్చింది. నిశబ్దం చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనుష్క సక్సెస్‌ను అందుకుంటాననే నమ్మకంతో ఉంది. మరి ఈ అమ్మడి కెరీర్‌లో నిశబ్దం ఎలాంటి శబ్దంను చేయబోతుందో చూడాలి.

Exit mobile version