ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కుర్ర హీరోని పక్కకు గెంటేసిన పెద్ద హీరో

బాలీవుడ్ లో ‘ఇన్ సైడర్ వర్సెస్ ఔట్ సైడర్’ టాపిక్ అన్నివేళలా రక్తి కట్టిస్తూనే ఉంది. ఇన్ సైడర్స్ ఔట్ సైడర్స్ కి అవకాశాలు రాకుండా అడ్డుకుంటారు. అందువల్లనే సుశాంత్ సింగ్ లాంటి ఔట్ సైడర్ మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డాడని కంగన లాంటి సీనియర్ నటీమణి విమర్శించారు. ఇక భూల్ భులయా 2లో కార్తీక్ ఆర్యన్ నటనపైనా కంగన ప్రశంసలు కురిపించింది. ఇలాంటి ప్రతిభ ఔట్ సైడర్స్ లోనే ఉందని కొనియాడింది. అక్షయ్ కంటే బెటర్ గా పెర్ఫామ్ చేశాడని కితాబిచ్చింది.

అదంతా అటుంచితే భూల్ భులయా సీక్వెల్లో అక్షయ్ నటించాల్సి ఉండగా ఆ స్థానంలోకి కార్తీక్ ఆర్యన్ ప్రవేశంపై ఖిలాడీ సపోర్టర్స్ అభిమానులు రుసరుసలాడారు. క్రైసిస్ లో ఉన్న బాలీవుడ్ కి బంపర్ హిట్టిచ్చిన కార్తీక్ ఆర్యన్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోగా ఖిలాడీ అక్షయ్ కి అదే ఏడాది(2022లో) వరుసగా భారీ డిజాస్టర్లు ఎదురవ్వడంతో అతడి పనైపోయిదని విమర్శలొచ్చాయి.

సరిగ్గా ఇలాంటి సమయంలో అక్షయ్ నటించాల్సిన మరో క్రేజీ ఫ్రాంఛైజీలోకి కార్తీక్ ఆర్యన్ ప్రవేశించాడని కథనాలు వైరల్ అయ్యాయి. ప్రతిష్ఠాత్మక హేరాఫేరి 3 కోసం కార్తీక్ ఆర్యన్ ని నిర్మాతలు ఎంపిక చేసుకోవడమే గాక ఖిలాడీ అక్షయ్ ని పక్కన పెట్టారని కథనాలొచ్చాయి. దీంతో అక్కీ చాలా సీరియస్ గా ఉన్నారని టాక్ వినిపించింది. అంతేకాదు సోషల్ మీడియాల్లో అక్షయ్ ఫ్యాన్స్ కార్తీక్ పైనా ఎటాక్ చేసారు. వరుసగా అక్షయ్ సినిమాల్ని హైజాక్ చేస్తున్నాడని అలకబూనారు. సామాజిక మాధ్యమాల్లో కార్తీక్ పై ట్రోలింగ్ చేసారు.

అదంతా అటుంచితే ఈ రెండు నెలల వ్యవధిలోనే హేరాఫేరి ఫ్రాంఛైజీ సమీకరణాలు మారిపోవడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. హేరా ఫేరి 3 కోసం అక్షయ్ కుమార్ తో మరోసారి చిత్రనిర్మాతలు చర్చలు సాగిస్తున్నారని తాజాగా కథనాలొస్తున్నాయి. ఈ చిత్రంలో అక్షయ్ తో పాటు సునీల్ శెట్టి- పరేష్ రావల్ మళ్లీ కలుస్తున్నారు. నిజానికి అక్షయ్ స్థానంలో కార్తీక్ ఆర్యన్ నటిస్తాడని హింట్ ఇచ్చింది నటుడు పరేష్ రావల్. కానీ ఇంతలోనే సమీకరణం మారిపోవడం ఆశ్చర్యపరుస్తోంది.

అక్షయ్ కుమార్- సునీల్ శెట్టి- పరేష్ రావల్ బృందంతో నిర్మాతలు ‘హేరా ఫేరి 3’పై చర్చలు ప్రారంభించినట్లు తాజా నివేదిక పేర్కొంది. కొన్ని నెలల క్రితమే సునీల్ శెట్టి – పరేష్ రావల్ ఈ చిత్రానికి ఓకే చెప్పగా.. అక్షయ్ విషయంలోనే డైలమా కొనసాగింది. అతడు భారీ పారితోషికం డిమాండ్ చేసాడని వరుస ఫ్లాపుల్లో ఉన్నాడని నిర్మాతలు కార్తీక్ వైపు మొగ్గు చూపారని కూడా కథనాలొచ్చాయి. అక్కీ స్థానంలో కార్తీక్ ఆర్యన్ ని ఖాయం చేసినట్టు కూడా పుకార్లు వచ్చాయి. అయితే ఈ ఒప్పందం కుదరలేదు. అక్షయ్ తో హేరాఫేరి నిర్మాతలు మళ్లీ కలిసి పని చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

హేరా ఫేరి 3 కోసం చర్చించడానికి గత శనివారం అక్షయ్ కుమార్- సునీల్ శెట్టి – పరేష్ రావల్ ఓచోట కలిసారని కూడా టాక్ వినిపిస్తోంది. ముంబైలోని ఎంపైర్ స్టూడియోస్ లో ఈ సమావేశం జరిగింది. హేరా ఫేరి 3 కోసం ఆ ముగ్గురు తారలు ఒకే గొడుగు కిందికి రావడం కొత్త ఏడాదిలో ఇదే మొదటిసారి అని తెలిసింది. వాస్తవానికి వీరందరినీ కలిసి చూసినప్పుడు ఎంపైర్ స్టూడియోలోని మొత్తం సిబ్బంది ఉద్వేగానికి లోనయ్యారు. వారంతా ఉత్సాహాన్ని కనబరిచారని ఒక గుసగుస వినిపించింది.

అయితే ప్రాజెక్ట్ పనుల్లో వేగం లేదు. నత్తనడకన సాగుతున్నాయని కథనాలొస్తున్నాయి. జరిగినది అంతా గతం. ఇది ప్రాజెక్టుకి బాగా కలిసి వస్తోంది .. పరిస్థితులు ఆశాజనకంగా మారుతున్నాయని స్టూడియో వర్గాలు వెల్లడిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా వాటాదారుల నుండి అధికారిక ప్రకటనను వినేందుకు అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. అన్నీ కుదిరిన తర్వాత ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడుతుంది. ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఒరిజినల్ లో నటించిన ఆ ముగ్గురితో మూడో పార్ట్ చిత్రీకరణకు అనుకూలంగా సన్నివేశం ముందుకు సాగుతుందని టాక్ వినిపిస్తోంది.

హేరా ఫేరి ఫ్రాంచైజీ మార్చి 2000లో ప్రారంభమైంది. ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ గా అలరించింది. తొలి చిత్రంలో టబు కూడా కథానాయిక. 2006లో సీక్వెల్ హేరా ఫేరి 2 లో టబు తిరిగి నటించలేదు. కానీ బిపాసా బసును ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. హేరా ఫేరి 3 విషయంలో వాస్తవంగా ఏం జరుగుతోందో కార్తీక్ ఆర్యన్ ని తప్పించి తిరిగి అక్షయ్ పేరును తెరపైకి తేవడానికి కారణమేమిటో వెల్లడి కావాల్సి ఉంది.

Exit mobile version