ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

చిరు బాలయ్య వయసు.. శృతి హాసన్ ఏమందంటే?

మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ ఇద్దరితోను మొదటిసారి నటించిన శృతిహాసన్ అది కూడా ఒకేసారి వారిద్దరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రీదేవి అంటూ చిరుతో స్టెప్పులు వేస్తూ కనిపించింది. ఇక మరోవైపు సుగుణసుందరి అంటూ బాలయ్యతో పిలిపించుకొని గ్లామరస్ లుక్ తో కనిపించింది.

ఆరు పదుల వయసు ఉన్న ఇద్దరు స్టార్ హీరోలతో మూడు పదుల వయసున్న శృతిహాసన్ రొమాంటిక్ హీరోయిన్ గా కనిపించడం అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ తరహా వయసుకు సంబంధించిన కామెంట్స్ ఎక్కువగా వస్తూ ఉండడంతో శృతిహాసన్ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ నటీనటులకు సంబంధించిన వయసు గురించి మాట్లాడుతున్నారు.

అయితే యాక్టింగ్ జీవితంలో వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఈ పరిశ్రమలో టాలెంట్ ఉన్నవారు వివిధ రకాలుగా జనాల్లో మంచి గుర్తింపు అందుకుంటారు అని అలాగే ఏ వయసులో ఉండాల్సిన అందం ఆ వయసులో ఉంటుంది అని కూడా ఆమె తెలివిగా వివరణ ఇచ్చారు.

ఇక సినిమాల్లో నటించడానికి వయసును కూడా చూడకూడదు అని అలాగే అందం విషయంలో అయితే వయసుకు సంబంధం లేదు అని కూడా అన్నారు.

ఎందుకంటే నేను వచ్చిన మొదట్లో కూడా తనను ఎవరూ పట్టించుకోలేదు అని స్టార్స్ వయసు గురించి మాట్లాడుకుంటే అది అనవసరమైన చర్చ అని ఆమె చాలా సున్నితంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనా కూడా స్టార్స్ ఎక్కువ వయసు ఉన్న హీరోలతో నటించడానికి ఏమాత్రం అభ్యంతరం చూపకూడదు అని కూడా ఈ బ్యూటీ చెప్పకనే చెప్పేసింది.

ఇక వాల్తేరు వీరయ్య వీరనరసింహ రెడ్డి రెండు సినిమాలు కూడా సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే. మరి ఈ రెండు సినిమాలతో శృతిహాసన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version