ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరు..?

ఏడాదికి పదుల సంఖ్యలో హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నా సరే వారికి టాలెంట్ కి తగిన సినిమాలు పడకపోవడం ఒకపక్క.. లక్ కలిసి రాకపోవడం మరోపక్క ఇలా ఎంట్రీ ఇచ్చిన 70 శాతం హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలకే కెరీర్ ముగించేస్తున్నారు. ఇక అలా కాకుండా వచ్చిన ఛాన్స్ తో ఆడియన్స్ ని మెప్పించి దర్శకుల దృష్టిలో పడిన వారి విషయానికి వస్తే వారిని మాత్రం వేళ్లతో లెక్క పెట్టాల్సి వస్తుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్స్ విషయానికి వస్తే పూజా హెగ్దే రష్మిక పేర్లు మాత్రమే వినిపిస్తాయి. వారి తర్వాతే ఏ హీరోయిన్ కి అయినా ఛాన్స్ అన్నట్టు ఉంది. అయితే వీరిద్దరు కేవలం తెలుగు సినిమాలే కాకుండా హిందీ తమిళ సినిమాలు చేస్తుండటంతో టాలీవుడ్ నెంబర్ 1 కి ఛాన్స్ లేకుండా పోయింది. ఇక ఉప్పెనతో హిట్టు కొట్టి వరుసగా అరడజను సినిమాలు చేసిన కృతి శెట్టి కూడా సక్సెస్ ట్రాక్ తప్పింది. మళ్లీ అమ్మడు తిరిగి ఫాం లోకి వస్తేనే కానీ నెంబర్ రేసులో ఉంటుంది.

కొన్నాళ్లుగా టాలీవుడ్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటూ వచ్చిన సమంత కూడా తన పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు గా హెల్త్ ఇష్యూస్ వల్ల రేసులో వెనకపడ్డది. అయినా కూడా తన మార్క్ సినిమాలతో పోటీ ఇస్తుంది సమంత.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో దూకుడు చూపిస్తున్న హీరోయిన్ ఎవరంటే అది శ్రీ లీల అని చెప్పొచ్చు. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన అమ్మడు పెళ్లి సందడి తెలుగు ఎంట్రీ ఇచ్చి ధమాకాతో సూపర్ హిట్ కొట్టింది.

రాబోయే రోజుల్లో మరిన్ని ఛాన్స్ లు వెయిటింగ్ లో ఉన్నాయని తెలుస్తుంది. ఈ అవకాశాలన్ని చూస్తుంటే దాదాపుగా శ్రీలీలకే టాలీవుడ్ ఆడియన్స్ టాప్ ప్లేస్ ఇచ్చేలా ఉన్నారు. అమ్మడి దూకుడు కూడా అదే రేంజ్ లో ఉంది కాబట్టి తప్పకుండా శ్రీలీలకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక అనుపమ నేహా శెట్టి మృణాల్ ఠాకూర్ లు కూడా ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నంలో ఉన్నారు. రీసెంట్ గా వాల్తేరు వీరయ్య వీర సింహా రెడ్డి సినిమాలతో శృతి హాసన్ కూడా తిరిగి రేసులోకి వచ్చింది. వీరందరిని దాటుకుని టాలీవుడ్ నెంబర్ 1 స్థానం ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

Exit mobile version