ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

‘తంగలాన్’మూవీ తో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను..విక్రమ్!

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. డబ్బింగ్ చిత్రాల ద్వారా విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ ప్రస్తుతం అతను నటిస్తున్న ‘తంగలాన్’మూవీ పై ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో విక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో, మాయలు, మంత్రాల నేపథ్యంలో ఈ మూవీ ముందుకు సాగుతుంది అన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం తవ్వడానికి బ్రిటిష్ వారు దగ్గరలో ఉన్న ఓ తెగను సంప్రదిస్తారు. అయితే ఆ కొండ దగ్గర దయ్యాలు, పిశాచాలు ఉన్నాయి అనే నమ్మకంతో అక్కడికి వెళ్లడానికి అందరూ భయపడుతూ ఉంటారు.

బ్రిటిష్ వారి వెనక విక్రం తన బృందాన్ని తీసుకొని వెళ్తాడు. అక్కడ అతనికి అడుగడుగునా అడ్డుపడే మాంత్రికురాలు పాత్రలో హీరోయిన్ ని చూపిస్తారు. ఇలా మొత్తం మీద ట్రైలర్ మూవీపై మంచి బజ్ సృష్టించింది. మూవీ విడుదల దగ్గర పడడంతో ప్రమోషన్స్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాదులో మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో మూవీకి సంబంధించిన చిత్ర బృందం అందరూ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విక్రమ్ ఈవెంట్ కు వచ్చిన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ..’మీరు చూపిస్తున్న ఈ ఎనర్జీ, మాపట్ల మీకున్న క్రేజ్ నిజంగా బంగారంలా కనిపిస్తోంది. తెలుగు సినీ ప్రియులు నాకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తులు. మాకు మీ సపోర్ట్ తో పాటు ఎంకరేజ్మెంట్ కూడా ఎప్పటికీ కావాలి.తంగలాన్ అనేది ఇప్పటి కథ కాదు.. ఓ 100 సంవత్సరాల క్రితం జరిగిన కథ. ఇది చాలా మంచి సినిమా అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మీకు సినిమా చూసినప్పుడు సర్ప్రైజింగ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో మూవీ గురించి నేను ఏమీ రిలీవ్ చేయడం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఈ మూవీలో నేను చేసిన రోల్ ఇప్పటివరకు నేను చేసిన అన్నిటిలోకి ది బెస్ట్ రోల్..’అని అన్నారు.

సహజంగా తాను నటించే సినిమాలలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకొని అద్భుతంగా నటించే విక్రమ్ ఇందులో ఒక తెగకు సంబంధించిన వ్యక్తిగా అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరుస్తారు అనడంలో డౌట్ లేదు. ఆగస్టు 15న ఈ మూవీ థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటే మిగిలిన సినిమాలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.

Exit mobile version