ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

దర్శకుల బుర్రకు సెన్సార్‌ అవసరం : జేడీ

ఓటీటీ కంటెంట్‌ అనగానే బూతు అనే అభిప్రాయం ఏర్పడింది. హిందీతో పాటు ఇతర భాషల్లో వచ్చిన వెబ్‌ సిరీస్ లు ఇంకా వెబ్ సినిమాలు బూతుల మయంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాస్త తగ్గిందనే చెప్పాలి. వెబ్‌ సిరీస్ లు అనగానే బూతు అనే అభిప్రాయంను మెల్ల మెల్లగా బయట పడుతున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా జేడీ చక్రవర్తి దయా అనే సిరీస్ లో నటించాడు.

ఆ వెబ్‌ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ బోల్డ్‌ కంటెంట్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓటీటీ కంటెంట్‌ కు సెన్సార్ అవసరం అంటూ ఈ మధ్య కాలంలో కొందరు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యం లో జేడీ చక్రవర్తి విభిన్నంగా స్పందించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

శృంగార సన్నివేశాలు తెరపై టికెట్‌ పెట్టి చూపించడంకు నేను పూర్తి వ్యతిరేకం. అందుకే నా వద్దకు వచ్చిన కొన్ని బోల్డ్‌ కంటెంట్‌ సిరీస్ లకు నో చెప్పాను. వాటిల్లో నటించేది లేదు అంటూ తెగేసి చెప్పాను. చాలా సన్నివేశాల్లో బోల్డ్‌ కంటెంట్‌ ఉన్న కారణంగా తాను కొన్ని సిరీస్‌ లను వదిలేసినట్లుగా కూడా జేడీ పేర్కొన్నాడు.

ఓటీటీలకు సెన్సార్‌ అవసరమా అన్న ప్రశ్నకు జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. సెన్సార్‌ ఓటీటీ కంటెంట్‌ కు కాదు.. దర్శకుల బుర్రలకు సెన్సార్‌ అవసరం. ప్రేక్షకులకు ఏం చెప్పాలి… ఏం చెప్పకూడదు అనే విషయం పై దర్శకుడికి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉందని జేడీ అబిప్రాయం వ్యక్తం చేశాడు. వెబ్‌ సిరీస్ ల్లో చూపించే శృంగార సన్నివేశాలకు..

మర్డర్‌ సన్నివేశాలకు సంబంధం ఉండటం లేదు. ప్రేక్షకుల అటెన్షన్‌ కోసమే అలాంటి సన్నివేశాలు పెడుతున్నారు. కథకు అవసరం అయ్యేవి ఒక్కటి కూడా లేవు అంటూ జేడీ కొన్ని సిరీస్‌ ల విషయంలో కామెంట్స్ చేస్తున్నాడు. జేడీ వ్యాఖ్యలను చాలా మంది నెటిజన్స్‌ సమర్థిస్తూ ఉన్నారు.

Exit mobile version