ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..!

తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి కొత్త వారితో చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా, ప్రణం దేవరాజ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమా ముహూర్తం జరిగింది. హరి క్రియేషన్స్ పతాకంపై పి.హరికృష్ణ గౌడ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది.

సినిమా ముహూర్త కార్యక్రమానికి ప్రముఖ నటుడు ఆకాష్ పూరీ అతిధిగా హాజరయ్యారు. ఆకాష్ పూరీ క్లాప్ కొట్టగా, దేవరాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి తణికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. బాల సరస్వతి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

హీరో ప్రణం దేవరాజ్ మాట్లాడుతూ, “ఇది నా మూడో సినిమా. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వస్తున్న కథ ఇది. మంచి లవ్ స్టోరీ, యాక్షన్‌తో వస్తుంది. మీ అందరి ప్రోత్సాహం కావాలని కోరుతున్నాను” అని అన్నారు.

దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మంచి కథ, మంచి టీమ్‌తో వస్తున్న సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను” అని అన్నారు.

నిర్మాత హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ, “ఇది మా మొదటి ప్రొడక్షన్. మంచి కథతో వస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుతున్నాను” అని అన్నారు.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 3వ వారం నుంచి హైదరాబాద్, వైజాగ్‌లో షూట్ చేయనున్నారు.

Exit mobile version