ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

దేవర మొదటి అడుగు.. అతనికి పెద్ద పరిక్షే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో కొరటాల సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ కొరియర్ లోనే బెస్ట్ మూవీ గా దేవర ఉంటుందని చిత్ర యూనిట్ బలంగా చెబుతుంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి.

ఇక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా ఈ మూవీలో నటిస్తున్నాడు. అలాగే జాన్వీ కపూర్ దేవర మూవీతో హీరోయిన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. భారీ అంచనాల మధ్య సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ని మే 20న రిలీజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో సర్ప్రైజ్ గా ఫస్ట్ సింగిల్ ని తీసుకురాబోతున్నారు.

కోలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అనిరుద్ రవిచందర్ దేవర చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమాతో అనిరుద్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే తెలుగులో ఇప్పటి వరకు అనిరుద్ చేసిన కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ కాలేదు.

మ్యూజిక్ ఆల్బమ్స్ హిట్ అయిన ఆ సాంగ్స్ సినిమాలకి ఏ విధంగా ప్లస్ కాలేదు. ఇక ఇప్పుడు దేవర సినిమాతో టాలీవుడ్ గ్రాండ్ సక్సెస్ కొట్టాలనే కసితో అనిరుద్ వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడం కూడా అనిరుద్ ఈ చిత్రంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి కారణం అని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకు మించి దేవర సాంగ్ ఉంటుందనే మాట వినిపిస్తోంది.

ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ ఆల్బమ్ దేవర చిత్రం నుంచి వస్తుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. దేవర ఫస్ట్ సింగిల్ తో దేశ వ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. పబ్లిక్ లోకి బలంగా తీసుకెళ్లే విధంగా డాన్స్ స్టెప్స్ తో ఈ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారంట. ఫ్యాన్స్ కూడా మే 20 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అనిరుద్ అభిమానులని దేవర ఫస్ట్ సింగిల్ తో ఏ స్థాయిలో సర్ప్రైజ్ చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version