ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ధనుష్ కోసం పవన్ వస్తాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతర హీరోల సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి గెస్ట్ గా హాజరు కావడం చాలా అరుదుగా జరుగుతుంది. తనకి భాగా సన్నిహితంగా ఉన్నవారు పిలిస్తే తన షెడ్యూల్ చూసుకొని వెళ్తూ ఉంటాడు. మెగాస్టార్ సినిమాలకి కూడా పవన్ కళ్యాణ్ రాడు. గతంలో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ ప్రీరిలేజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ సమయంలో కాస్తా రాజకీయ విమర్శలు చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.

ఇక అయితే సినిమా ఈవెంట్ లో రాజకీయ విమర్శలు చేయడంపై కొంత మంది వ్యతిరేకించారు. ఆ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకి ఏపీ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయి.

ఈ ఎఫెక్ట్ రిపబ్లిక్ సినిమా మీద కూడా పడిందనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే ఆ తరువాత ఓ రెండు మూడు సినిమాలకి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వెళ్ళిన కూడా రాజకీయ విషయాలు ఏమీ ప్రస్తావించకుండా సినిమా గురించి మాత్రమే మాట్లాడారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి సార్ ప్రీరిలేజ్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ వస్తాడనే మాట వినిపిస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్ అంటే హారికహాసినిని అనుబంధ సంస్థ అనే సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ తో ఉన్న అనుబంధంతో పవన్ కళ్యాణ్ ని సార్ మూవీ ప్రీరిలీజ్ కోసం గెస్ట్ గా ఇన్వైట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండనే మాట వినిపిస్తుంది.

ఒక వేళ పవన్ కళ్యాణ్ కాని ప్రీరిలీజ్ ఫంక్షన్ ని వస్తే కచ్చితంగా అది హైలైట్ అవుతుంది ఈ నెల సార్ 17న సార్ మూవీ రిలీజ్ కాబోతూ ఉండగా ఫిబ్రవరి 14న ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. దీంతో సినిమాకి ఫుల్ హైప్ రావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎంత వరకు వస్తాడు అనేది ఇప్పుడు చూడాలి.

Exit mobile version