ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ధనుష్ రూ.కోటి విరాళం.. ఎందుకో తెలుసా!

చాలా సంవత్సరాలుగా నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం గురించిన చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. నడిగర్‌ సంఘం భవనం పూర్తి అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంటూ ఆ మధ్య హీరో విశాల్‌ కూడా శఫథం చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

భవన నిర్మాణం కోసం నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్‌, ప్రధాన కార్యదర్శి విశాల్‌ ఇంకా కోశాదికారి కార్తీ చాలా కష్టపడుతున్నారు. అత్యాధునిక హంగులతో అతి పెద్ద భవనం నిర్మించేందుకు గాను సంఘం వద్ద నిధుల కొరత ఉంది. అందుకే పలువురు ప్రముఖులు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం కు ముందుకు వస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం హీరో శివ కార్తికేయన్‌ రూ.50 లక్షలను విరాళంగా సంఘంకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నడిగర్ సంఘం భవనం కోసం స్టార్‌ హీరో ధనుష్ ఏకంగా రూ.కోటి లను అందించడం జరిగింది. కోటి ఆర్థిక సాయం చేసినందుకు గాను అధ్యక్షుడు నాజర్ మరియు కోశాధికారి కార్తి కలిసి ధనుష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీగా సంపాదిస్తున్న ధనుష్ తన స్థాయికి తగ్గట్లుగా ఈ సాయం ను అందించారు. ఇంకా పలువురు తమిళ స్టార్స్‌ కూడా ఆర్థిక సాయంకు ముందుకు వస్తున్నారు. అతి త్వరలోనే వారి సాయంతో నడిగర్‌ భవనం పూర్తి అవ్వడం ఖాయం.

ధనుష్ బ్యాక్ టు బ్యాక్ తెలుగు లో సినిమాలు చేస్తున్నాడు. సార్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు కుబేరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో వైపు కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. ఆ సినిమాని దిల్‌ రాజు నిర్మించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Exit mobile version