ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ధోని అడిగితే మహేష్ కాదంటాడా?

క్రికెట్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఎంఎస్ ధోని ప్రస్తుతం ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఈ సమయంలో ఆయన ఎన్నో వ్యాపారాలను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సమయంలోనే ధోని సినిమా రంగంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

వందల కోట్ల లాభాలు దక్కే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం ద్వారా ధోనీ మరింత మందికి చేరువ అవ్వాలని భావిస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే ధోని హిందీ సినిమాలతో పాటు సౌత్ లో కూడా పలు సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. స్థానిక నిర్మాణ సంస్థలతో కలిసి ధోని సినిమా నిర్మాణం జరుగబోతుంది.

ధోని సినిమాల నిర్మాణం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుతో మొదలు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ధోనీ ప్రతినిధులు ఇప్పటికే మహేష్ బాబుతో చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి. ధోనీ కూడా స్వయంగా మాట్లాడాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ధోనీ అడిగితే మహేష్ బాబు కాదు అంటాడా… ఓకే అనేసినట్లుగా తెలుస్తోంది.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయ్యింది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మహేష్ బాబు చేస్తాడు. ఆ తర్వాత ధోని నిర్మాణంలో మహేష్ బాబు సినిమా ఉండే అవకాశం ఉంది.

Exit mobile version