ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నాగార్జున కుండబద్ధలు కొట్టేశారు..!

మహానటి తర్వాత సెలబ్రిటీ బయోపిక్ లు ఎక్కువ అయ్యాయి. బాలీవుడ్ లో మొదలైన ఈ బయోపిక్ సినిమాల హవా తెలుగు పరిశ్రమకు పాకింది. మహానటి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించారు. ఎన్ టీ ఆర్ కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా ఆ సినిమా వచ్చింది. ఐతే బాలకృష్ణ నటించిన ఈ సినిమాలు ఎందుకో ప్రేక్షకులను మెప్పించలేదు. ఐతే ఎన్టీఆర్ తర్వాత ఏఎన్నార్ బయోపిక్ కూడా తీస్తారా అన్న ప్రశ్న నాగార్జునని ఎప్పుడు అడుగుతుంటారు.

ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్ అయ్యిందన్న కారణం చేత కాదు కానీ ఏఎన్నార్ బయోపిక్ పై నాగార్జున మొదటి నుంచి ఒకటే ఆన్సర్ చెబుతూ వస్తున్నారు. ఏఎన్నార్ గారు కెరీర్ తొలినాళ్లలో తప్ప ఆయన పికప్ అందుకున్నాక వెనక్కి తిరిగి చూడలేదు. అందుకే ఆయన బయోగ్రఫీ సినిమా చేసేందుకు వీలు ఉండదని అన్నారు. లేటెస్ట్ గా గోవాలో జరుగుతున్న iffi వేడుకల్లో కూడా ఏఎన్నార్ బయోపిక్ పై అదే మాట చెప్పారు నాగార్జున.

ఐతే ఏఎన్నార్ బయోపిక్ సినిమాగా కాకుండా డాక్యుమెంటరీ గా చేసే ఆలోచన చేస్తామని అన్నారు. ఇప్పటికే ఏఎన్నార్ బయోగ్రఫీకి సంబంధించి చాలా బుక్స్ వచ్చాయి. దానితో పాటు ఏఎన్నార్ కూడా తన స్వీయ అనుభవాలను వీడియోల రూపంలో ఉంచారు. ఇవన్ని ఉండగా మళ్లీ ప్రత్యేకంగా సినిమా ఎందుకు అని అనుకుంటున్నారు. ఈ విషయంలో నాగార్జున కుండ బద్దలు కొట్టినట్టుగా సమాధానం చెబుతున్నారు. ఏఎన్నార్ బయోపిక్ సినిమాగా కాదు డాక్యుమెంటరీగా చేసే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.

తెలుగు పరిశ్రమకు ఏఎన్నార్ ఒక గని అని చెప్పొచ్చు. ఆయన సినిమాల ద్వారా తెలుగు పరిశ్రమ ఎంతో ఎత్తుకి ఎదిగింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఆ ఫామ్ ను కొనసాగించారు. ఏఎన్నార్ శత జయంతి సంవత్సరంలో iffiలో ఏఎన్నార్ నివాళి అందిస్తూ ఆయన సినిమాలు ప్రదర్శించారు. ఈ వేడుకలకు అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, నాగ చైతన్య, శోభిత, సుశాంత్ లు అటెండ్ అయ్యారు. ఏఎన్నార్ వారసత్వాన్ని తీసుకుని కింగ్ నాగార్జున కూడా హీరోగా తన సినిమాలతో పాటు నిర్మాతగా కూడా పరిశ్రమకు సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు. నాగార్జున తో పాటు అక్కినేని హీరోలు కూడా ఫ్యాన్స్ ని మెప్పించే సినిమాలతో వస్తున్నారు.

Exit mobile version